పాలేరు ఎమ్మెల్యే సోదరుడు హఠాన్మరణం
ABN , First Publish Date - 2021-05-06T04:48:03+05:30 IST
పాలేరు శాసనసభ్యుడు కందాళ ఉపేందర్‌రెడ్డి సోదరుడు జితేందర్‌రెడ్డి (58) బుధవారం గుండెపోటుతో హైదరాబాద్‌లో మృతిచెందాడు, ఆయనకు భార్య, కూతురు, కుమారుడు ఉన్నారు.

జితేందర్‌రెడ్డికి ఘన నివాళి
ఎమ్మెల్యే కందాళ ఉపేందర్‌రెడ్డికి పలువురి పరామర్శ
కూసుమంచి, మే5: పాలేరు శాసనసభ్యుడు కందాళ ఉపేందర్‌రెడ్డి సోదరుడు జితేందర్‌రెడ్డి (58) బుధవారం గుండెపోటుతో హైదరాబాద్‌లో మృతిచెందాడు, ఆయనకు భార్య, కూతురు, కుమారుడు ఉన్నారు. బుధవారం ఉదయం లేచిన కొద్దిసేపటికి ఛాతినొప్పికి గురయ్యాడు. వెంటనే ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ కొద్దిసేపటికి మృతిచెందాడు, మృతదేహాన్ని స్వగ్రామం రాజుపేట తరలించి అంత్యక్రియలు నిర్వహించారు. జితేందర్‌రెడ్డి మృతదేహానికి సోదరులు సురేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే కందాళ ఉపేందర్‌రెడ్డి, కుటుంబసభ్యులు నివాళులు అర్పించారు. కందాళ అభిమానులు, టీఆర్‌ఎస్ నాయకులు పెద్దఎత్తున చేరుకుని అంత్యక్రియల్లో పాల్గొన్నారు. సోదరుడు మృతి తమ కుటుంబానికి తీరనిలోటని ఎమ్మెల్యే ఉపేందర్‌రెడ్డి కన్నీటిపర్యం తమయ్యారు.
నేలకొండపల్లి: జితేందర్‌రెడ్డి ఆకస్మిక మృతి పట్ల పలువురు టీఆర్‌ఎస్, కాంగ్రెస్ నాయకులు సంతాపం ప్రకటించారు. కాంగ్రెస్ ఒక మంచి నిజాయితీ కల నాయకుని కోల్పోయిందని కాంగ్రెస్ నాయకులు అన్నారు. కాంగ్రెస్‌లో ఉన్నప్పటికీ, తన సోదరుడు, ఎమ్మెల్యే ఉపేందర్‌రెడ్డికి అన్ని విషయాల్లో అండగా నిలిచిన జితేందర్‌రెడ్డి మృతి తీరని లోటని నాయకులన్నారు. కాంగ్రెస్ నాయకులు షేక్.హుస్సేన్, ఆరెకట్ల గురునాధం, చిట్టూరి అచ్చయ్య, తోట వెంకటేశ్వర్లు, టీఆర్‌ఎస్ నాయకులు ఉన్నం బ్రహ్మయ్య, నెల్లూరి లీలాప్రసాద్, నాగుబండి శ్రీనివాసరావు, ఎంపీపీ వజ్జా రమ్య, గొలుసు రవిలతో పాటు పలువురు సర్పంచ్‌లు, సొసైటీ డైరెక్టర్లు సంతాపం తెలిపారు.
ఖమ్మంరూరల్: మండలంలోని వివిధ రాజకీయ పార్టీల నాయకులు జితేందర్‌రెడ్డికి నివాళులర్పించారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన మండల నాయకులు మద్ది వీరారెడ్డి, తల్లంపాడు సర్పంచ్ యరసాని శివశంకర్‌రెడ్డి, కన్నేటి వెంకన్న, పాప్యానాయక్, టీఆర్‌ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు బెల్లం వేణుగోపాల్, కార్యదర్శి రెడ్యానాయక్, ఎంపీపీ బెల్లం ఉమా, వైస్‌ఎంపీపీ దరగయ్య, జెడ్పీటీసీ యండపల్లి వరప్రసాద్, సీపీఎం మండల కార్యదర్శి నండ్రాప్రసాద్, సీపీఐ జిల్లా సహయకార్యదర్శి దండి సురేష్, టీఆర్‌ఎస్ నాయకులు జొన్నలగడ్డ శ్రీధర్, ఆనంద్, మట్టా వెంకటేశ్వర్లు తదితరులు నివాళులర్పించారు.