ఎమ్మెల్యే ధోరణిలో మార్పు రావాలి

ABN , First Publish Date - 2021-08-21T05:14:25+05:30 IST

ఎమ్మెల్యే ధోరణిలో మార్పు రావాలి

ఎమ్మెల్యే ధోరణిలో మార్పు రావాలి
మాట్లాడుతున్న ఏడీ కోటేశ్వరరావు, పక్కన మాజీ మంత్రి తుమ్మల

శవరాజకీయాలు మానుకోవాలి

పాలేరు శాసనసభ్యుడు కందాళ ఉపేందర్‌రెడిపై ట్రాన్స్‌కో ఏడీ కోటేశ్వరరావు విమర్శలు

మాజీ మంత్రి తుమ్మలపై ప్రశంసల జల్లు

నేలకొండపల్లి, ఆగస్టు 20: ఆయన పేరు బీరావత్‌ కోటే శ్వరరావు. ట్రాన్స్‌కోలో ఏడీగా సికింద్రాబాద్‌లో విధులు నిర్వహిస్తున్నారు. శుక్రవారం తన స్వగ్రామమైన ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం మంగాపురం వచ్చారు. ఇదే క్రమంలో పలుకుటుంబాలను పరామర్శించేందుకు మంగా పురం వెళ్లారు మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. దీంతో తుమ్మలను తన ఇంటికి ఆహ్వానించారు కోటేశ్వర రావు. ఈ సందర్భంగా మాట్లాడిన ఏడీ కోటేశ్వరరావు.. తుమ్మల హయాంలో జరిగిన అభివృద్ధి, ఆయన రాజకీయ చతురతను గుర్తు చేస్తూ.. తుమ్మలపై ప్రశంసలు కురిపిం చి.. సన్మానించారు. ప్రస్తుత పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్‌రెడ్డి చేయాల్సిన పనులు చేయకుండా, శవ రాజ కీయాలు చేయటం బాధగా ఉందంటూ విమర్శలు గుప్పిం చారు. ఈ క్రమంలో ఏడీ మాట్లాడిన వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ‘గ్రామంలో సమస్యలు పరిష్కారం కావటం లేదు. వర్గాలుగా చూస్తున్నారు. ఎమ్మెల్యేలో మార్పురావాలి. ఇక నుంచైనా సామరస్యంగా అందరినీ కలుపుకొని పోవాలి. రేపు టిక్కెట్టు ఎవ రికి వస్తే వారికే వేస్తాం. గెలిపిస్తాం. కానీ ఈ కక్ష సాఽధింపు ధోరణి మానుకోవాలని సూచించారు. ఎమ్మెల్యేగా చేయాల్సి న పని చేయకుండా ఎవరైనా చనిపోతే రూ.10వేలు ఇచ్చి, గ్రూపుల్లో పెట్టుకోవటం, పెద్దగా ప్రచారం చేసుకోవటం, ఈ కార్యక్రమాన్ని చూస్తే తనకు బాధగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం రిలీఫ్‌ ఫండ్‌ నుంచి ఆసుపత్రుల్లో ఉండి ఇబ్బంది పడుతున్నవారికి నేను పనిచేసే చోట ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి నెలకు 20నుంచి 30మందికి రూ.50వేలు చెక్కులు అందిస్తున్నారు. ఇలాంటి చెక్కులు ఇప్పించి చావకుండా చూడాల్సిన బాధ్యత పోయి ఎక్కడ శ్మశానవాటిక వద్ద పొగ వస్తుంటే అక్కడికి 50మంది వస్తే రూ.10వేలు చెక్కు ఇచ్చేయ్‌.. ఫొటో తీసేయ్‌, గ్రూపులో పెట్టేయ్‌, ఈ పద్ధతిలో శవరాజకీయాలు మానుకోవాలి’ అని ఎమ్మెల్యే కందాళను ఉద్దేశించి వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారింది.

Updated Date - 2021-08-21T05:14:25+05:30 IST