ఇంతపెద్ద సంస్థలో చిన్నచిన్న పొరపాట్లు సహజం

ABN , First Publish Date - 2021-12-08T05:23:22+05:30 IST

ఇంత పెద్ద సంస్థలో చిన్నిచిన్నపొరపాట్లు సహజమేనని, కానీ కొందరు జర్నలిస్టులు వాటిని బూతద్దంలో చూపుతున్నారని టీఎస్‌ జెన్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావు ఆవేదన వ్యక్తం చేశారు

ఇంతపెద్ద సంస్థలో చిన్నచిన్న పొరపాట్లు సహజం
కేటీపీఎస్‌ను సందర్శిస్తున్న జెన్‌కో సీఎండీ

విద్యుత ఉత్పత్తిలో తెలంగాణ జెన్‌కో దేశానికే ఆదర్శం

పాల్వంచ కేటీపీఎస్‌ సందర్శనలో సీఎండీ ప్రభాకరరావు

మణుగూరు బీటీపీఎస్‌లో అడ్మినిసే్ట్రషన భవనం ప్రారంభం

పాల్వంచ/మణుగూరు రూరల్‌, డిసెంబరు 7: ఇంత పెద్ద సంస్థలో చిన్నిచిన్నపొరపాట్లు సహజమేనని, కానీ కొందరు జర్నలిస్టులు వాటిని బూతద్దంలో చూపుతున్నారని టీఎస్‌ జెన్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావు ఆవేదన వ్యక్తం చేశారు. పాల్వంచలోని కొత్తగూడెం థర్మల్‌ పవర్‌స్టేషన సందర్శనకు వచ్చిన ఆయన మంగళవారం కేటీపీఎస్‌ ఏడోదశలో విలేకరులతో మాట్లాడారు. నాణ్యమైన విద్యుత్‌ ఉత్పత్తిలో దేశవ్యాప్తంగా తెలంగాణ జెన్‌కోకు ప్రశంసలు దక్కుతున్నాయని, ఇటీవల జాతీయస్థాయిలో నాణ్యమైన విద్యుత ఉత్పత్తి, పీఎల్‌ఎఫ్‌ల్లో జెన్‌కో బంగారు పతకం సాధించిందన్నారు. ఏదైనా సమస్య దృష్టికి వచ్చినప్పుడు అధికారులతో మాట్లాడితే వాస్తవాలు వెలుగులోకి వస్తాయన్నారు. అయితే కేటీపీఎస్‌ ఏడోదశ చీఫ్‌ ఇంజనీర్‌ తాము ఫోన్‌ చేసినా స్పందించటం లేదని విలేకరులు సీఎండీకి ఫిర్యాదు చేయగా.. దీనిపై తాను అధికారులతో మాట్లాడతానన్నారు. అయితే కేటీపీఎస్‌ అనుబంధ డీఏవీ పాఠశాలలో విలేకరుల పిల్లలకు ఫీజుల్లో రాయితీ కల్పించాలని కోరగా.. దీనిపై నిర్ణయం తీసుకుంటామన్నారు. కేటీపీఎస్‌ 5, 6దశలతో పాటు ఏడోదశ, నిర్మాణంలో ఉన్న జెన్కో ట్రైనింగ్‌ సెంటర్‌ను సందర్శించిన ఆయన పలు విషయాలపై అధికారులో సమీక్షించారు. ఆయన వెంట థర్మల్‌ డైరెక్టర్‌ బాదావత్‌ లక్ష్మయ్య, జెన్‌కో టెక్నికల్‌ ఎస్‌ఈ ఈగ హనుమాన్‌, విజిలెన్స్‌ ఎస్‌పీ వినోద్‌కుమార్‌, కేటీపీఎస్‌ కాంప్లెక్స్‌ చీఫ్‌ ఇంజనీర్లు కమతం రవీందర్‌కుమార్‌, పలుకుర్తి వెంకటేశ్వరావు, ఉపేందర్‌, పలువురు ఎస్‌ఈలు ఉన్నారు.

 బీటీపీఎస్‌ అడ్మినిసే్ట్రషన భవనానికి ప్రారంభోత్సవం

మణుగూరు భద్రాద్రి థర్మల్‌ పవర్‌స్టేషనలో నూతనంగా నిర్మించిన అడ్మినిస్టేషన భవనంతో పాటు సీఈ కార్యాలయం, క్యాంటీన, ఫైర్‌ స్టేషనలను జెన్కో సీఎండీ ప్రభాకర్‌రావు మంగళవారం ప్రారంభించారు. వరుసగా రెండో రోజు బీటీపీఎస్‌ను సందర్శించిన ఆయన నూతన భవనాల ప్రారంభోత్సవాలతో పాటు పలు పనులను పరిశీలించారు. అనంతరం బీటీపీఎస్‌,  బీహెచఈఎల్‌, కాంటాక్ట్‌ ఏజెన్సీ ప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గడువులోగా ప్రాంట్‌ నిర్మాణ పనులన్నీ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. నిర్మాణ పనుల్లో కాంట్రాక్ట్‌ ఏజెన్సీల నిర్లక్ష్యం వల్ల జాప్యం జరుగుతోందని అసహనం వ్యక్తం చేశారు. బీటీపీఎస్‌ ప్లాంట్‌లో పారిశుధ్య నిర్వహణపై సీఎండీ ప్రభాకరరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఆయన వెంట డైరెక్టర్లు సచ్చిదానందం, అజయ్‌కుమార్‌, లక్ష్మయ్య, సీఈ బాలరాజు, బీహెచఈఎల్‌, బీటీపీఎస్‌ అధికారులున్నారు. 

Updated Date - 2021-12-08T05:23:22+05:30 IST