చర్ల మండలంలో వెలిసిన మావోయిస్టు కరపత్రాలు
ABN , First Publish Date - 2021-11-29T04:48:56+05:30 IST
మండల పరిధిలోని లెలిన్ కాలనీ సమీపంలో ఆదివారం ఉదయం మావోయిస్టు కరపత్రాలు వెలిశాయి.

చర్ల, నవంబరు 28: మండల పరిధిలోని లెలిన్ కాలనీ సమీపంలో ఆదివారం ఉదయం మావోయిస్టు కరపత్రాలు వెలిశాయి. చర్ల, శబరి ఏరియా కమిటీ పేరుతో ఉన్న ఆ కరపత్రాల్లో డిసెంబరు 2 నుంచి 8 వరకు మావోయిస్టు పార్టీ పీఎల్‌జీఏ వారోత్సవాలను ఘనంగా నిర్వహించాలని, కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు కొనసాగిస్తున్న విప్లవ ప్రతిఘాతుక సమాధాన్ ప్రహార్ దాడికి వ్యతిరేకంగా పోరాడాలని, పోలీస్ క్యాంపుల నిర్మాణాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తులన కదలాలని మావోయిస్టులు పిలునిచ్చారు. కాగా గత కొద్ది రోజుల క్రితం ఇదే రహదారిపై వాల్ పోస్టర్లు పెట్టిన మావోయిస్టులు, మందు పాతర పెట్టారు. స్థానికి యువకుడు గాయాల పాలయ్యాడు. ఆదివారం కూడా అదే ప్రాంతలో కరపత్రాలు వెలియడంతో స్థానికులు భయాందోళన చెందారు.