విద్యుత్‌షాక్‌తో వ్యక్తి మృతి

ABN , First Publish Date - 2021-10-21T04:47:55+05:30 IST

మండలంలోని గోవిందాపురం(ఏ) గ్రామంలో బుధవారం రాత్రి విద్యుదాఘాతంతో ఓ వ్యక్తి మృతిచెందాడు.

విద్యుత్‌షాక్‌తో వ్యక్తి మృతి

బోనకల్‌, అక్టోబరు 20: మండలంలోని గోవిందాపురం(ఏ) గ్రామంలో బుధవారం రాత్రి విద్యుదాఘాతంతో ఓ వ్యక్తి మృతిచెందాడు. గ్రామానికి చెందిన షేక్‌.నాగులు((28) తన ఇంట్లో స్విచ్‌బోర్డు వదులుగా ఉండటంతో మరమ్మతులు చేసేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో విద్యుత్‌షాక్‌కు గురై అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలున్నారు.


Updated Date - 2021-10-21T04:47:55+05:30 IST