తుమ్మలచెరువుపై లస్కర్లను నియమించాలి

ABN , First Publish Date - 2021-08-22T05:06:19+05:30 IST

మండలంలో ప్రధాన సాగునీటివనరుగా పేరొందిన తుమ్మలచెరువు పై ప్రభుత్వం వెంటనే ఇద్దరు లస్కర్లను నియమించాలని ఆయకట్టు రైతులు విజ్ఞప్తి చేశారు.

తుమ్మలచెరువుపై లస్కర్లను నియమించాలి
ఇరిగేషన్‌ డీఈకి వినతిపత్రం అందజేస్తున్న ఆయకట్టు రైతులు

ఇరిగేషన్‌ డీఈకి ఆయకట్టు రైతుల వినతి

అశ్వాపురం ఆగస్టు 21: మండలంలో ప్రధాన సాగునీటివనరుగా పేరొందిన తుమ్మలచెరువు పై ప్రభుత్వం వెంటనే ఇద్దరు లస్కర్లను నియమించాలని ఆయకట్టు రైతులు విజ్ఞప్తి చేశారు. ఈమేరకు శనివారం ఆయకట్టు రైతుల సమావేశం మొండికుంట సర్పంచ్‌ మర్రి మల్లారెడ్డి అధ్యక్షతన మొండికుంట పంచాయతీ కార్యాలయంలో జరిగింది. తుమ్మలచెరువులో ప్రస్తుతం 13 అడుగుల నీరు నిల్వ ఉందని, ఈ నీటితో చివరి ఆయకట్టు వరకు నీరు అందించేందుకు లష్కర్‌ల పర్యవేక్షణ అవసరమని సమావేశంలో నిర్ణయించారు. అనంతరం తుమ్మలచెరువు ప్రదాన కాలువలయిన ఊరవాయి, చదలవాడ, కుందారం కాలువల్లో పూడిక తీయించాలని, ఆర్‌ఆర్‌ఆర్‌ నిధులతో చెరువు అభివృద్ధి పనులను జరిపించాలని కోరుతూ ఇరిగేషన్‌ మణుగూరు డీఈ శ్రీనివాస్‌కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో ఏఈ సుచరిత, మాజీ ఎంపీపీ కొల్లు మల్లారెడ్డి, మొండికుంట ఎంపీటీసీ కమటం నరేష్‌, తుమ్మలచెరువు ఆయకట్టు కమిటీ సభ్యులు తుక్కాని రామిరెడ్డి, అక్కిన శ్రీనివాసరావు, రైతులు కమటం వెంకటేశ్వరరావు, ముస్కు శ్రీనివాసరెడ్డి, ముద్దం సైదిరెడ్డి పాల్గొన్నారు.  


Updated Date - 2021-08-22T05:06:19+05:30 IST