హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు

ABN , First Publish Date - 2021-10-30T05:06:12+05:30 IST

దొంగతనం, వృద్ధురాలిని హత్యచేసిన కేసులో మధిరకు చెందిన ఓ వ్యక్తికి ఏడాది శిక్ష, జీవితఖైదుతో పాటు రూ.1000జరిమానా విధిస్తూ నాలుగో అదనపు జిల్లా జడ్జీ సీవీఎస్‌.సాయిభూపతి శుక్రవారం తీర్పు ఇచ్చారు.

హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు

సత్తుపల్లిరూరల్‌, అక్టోబరు 30 : దొంగతనం, వృద్ధురాలిని హత్యచేసిన కేసులో మధిరకు చెందిన ఓ వ్యక్తికి ఏడాది శిక్ష, జీవితఖైదుతో పాటు రూ.1000జరిమానా విధిస్తూ నాలుగో అదనపు జిల్లా జడ్జీ సీవీఎస్‌.సాయిభూపతి శుక్రవారం తీర్పు ఇచ్చారు. మధిర మండలం చందర్లపాడుకు చెందిన సాతుపాటి నాగేశ్వరరావు సమీపంలోని సిరిపురంలో అద్దెకు ఉంటూ సెంట్రింగ్‌ పనులు చేస్తుంటాడు. ఈ క్రమంలో 2019 ఆగస్టు 26తెల్లవారుజామున అదే మండలం రాయపట్టణానికి చెందిన బొమ్మకంటి రంగమ్మ ఇంటిలో నిద్రిస్తోంది. ఈ సమయంలో ఆమె నానుతాడు అపహరించే క్రమంలో కర్రతో మోది వృద్ధురాలిని హత్య చేశాడు. ఆమె కుమారుడు హరిబాబు మధిర టౌన్‌ పీఎస్‌లో ఫిర్యాదు చేయగా హత్య, దొంగతనం చేసినట్లు ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. పాత నేరస్థుడు అయిన నాగేశ్వరరావును పోలీసులు రిమాండ్‌కు పంపారు. తాజాగా సత్తుపల్లిలోని నాలుగో అదనపు కోర్టులలో ట్రెయల్‌ విధించి 18మంది సాక్ష్యులను న్యాయమూర్తి సీవీఎస్‌.సాయిభూపతి విచారించారు. అనంతరం హత్య కేసులో జీవిత ఖైదు, రూ.500జరిమానా, దొంగతనం కేసులో ఏడాది జైలు శిక్షతో పాటు రూ.500జరిమానా విధించారు. అదనపు పీపీ ఇనపనూరి మహేంద్రనాథ్‌ ప్రాసిక్యూషన్‌ తరపున వాధించగా సాక్షులను ప్రవేశ పెట్టి నిందితుడికి శిక్ష పడేందుకు మధిర కానిస్టేబుల్‌ సత్యనారాయణ, హోంగార్డు రవి, సత్తుపల్లి కోర్టు హోంగార్డు బుద్దా శ్రీనివాస్‌ సహకరించారు.

Updated Date - 2021-10-30T05:06:12+05:30 IST