గ్రామాల అభివృద్ధికి ఎల్‌ఐసీ చేయూత
ABN , First Publish Date - 2021-08-26T05:10:37+05:30 IST
బీమా గ్రామం పథకం కింద గ్రామాల అభివృద్ధికి ఎల్‌ఐసీ తన వంతు చేయూత నిస్తుందని ఎల్‌ఐసీ వరంగల్ సీనియర్ డివిజనల్ మేనేజర్ ఎస్ ధామస్ అన్నారు.

వరంగల్ డివిజన్ మేనేజర్ థామస్
కారేపల్లి, ఆగస్టు 25: బీమా గ్రామం పథకం కింద గ్రామాల అభివృద్ధికి ఎల్‌ఐసీ తన వంతు చేయూత నిస్తుందని ఎల్‌ఐసీ వరంగల్ సీనియర్ డివిజనల్ మేనేజర్ ఎస్ ధామస్ అన్నారు. బుదవారం కారేపల్లికి వచ్చిన ఆయన మాట్లాడుతూ మండల పరిధిలోని కారేపల్లి, పేరుపల్లి, మాధారం గ్రామలు బీమా గ్రామాలుగా ఎంపిక అయ్యాయని తెలిపారు. కారేపల్లికి చెందిన సినియర్ ఏజెంట్ ఇందుర్తి సురేందర్‌రెడ్డి కృషితో ఈమూడు గ్రామాలు బీమా గ్రామాలుగా ఎంపికయ్యాయన్నారు. సురేందర్‌రెడ్డిని ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో పలువురు ఎల్‌ఐసీ అధికారులు పాల్గొన్నారు.