పేదలందరికీ ఉచిత న్యాయ సేవలు

ABN , First Publish Date - 2021-11-10T04:48:21+05:30 IST

పేదలందరికీ ఉచితంగా న్యాయం అందించడమే న్యాయ సేవాధికార సంస్థ లక్ష్యమని ఉమ్మడి ఖమ్మం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ, ఖమ్మం సీనియర్‌ సివిల్‌ జడ్జీ ఎండీ అబ్దుల్‌ జావీద్‌పాషా అన్నారు.

పేదలందరికీ ఉచిత న్యాయ సేవలు
సదస్సులో మాట్లాడుతున్న జావిద్‌పాషా

జిల్లా న్యాయ సేవా సంస్థ సెక్రటరీ అబ్దుల్‌ జావీద్‌పాషా

మణుగూరుటౌన్‌, నవంబరు 9: పేదలందరికీ ఉచితంగా న్యాయం అందించడమే న్యాయ సేవాధికార సంస్థ లక్ష్యమని ఉమ్మడి ఖమ్మం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ, ఖమ్మం సీనియర్‌ సివిల్‌ జడ్జీ ఎండీ అబ్దుల్‌ జావీద్‌పాషా అన్నారు. జాతీయ న్యాయ సేవల దినోత్సవం సందర్భంగా సాంబయిగూడెం, తిర్లాపురం, మణుగూరు, అన్నారం, చినవారి గూడెంలో నిర్వహించిన న్యాయ చైతన్య సదస్సులో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొని ప్రసంగించారు. పాతిక ఏళ్ళ క్రితం న్యాయ సేవాధికార సంస్థను స్థాపించామన్నారు. పేదవారు ఆయా న్యాయ సేవాసంస్థలను ఆశ్రయించి ఉచతింగా న్యాయ సేవలను పొందవచ్చన్నారు. కార్యక్రమంలో మణుగూరు బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు కుర్మ విజయ్‌, ఉచిత న్యాయసేవా న్యాయవాది కవిత, అసోసియేషన్‌ ఉపాధ్యక్షురాలు సరస్వతి, సెక్రటరీ రామ్మోహన్‌రావు, భాస్కర్‌, రవి, సర్పంచ్‌లు కామ రాజు, తిరుపతమ్మ, ట్రైనీ ఎస్‌ఐ పీవీఎన్‌ రావు, ఎంపీవో పల్నాటి వెకటేశ్వరరావు, ఖలీల్‌పాషా పాల్గొన్నారు. 

జూనియర్‌ కళాశాలలో న్యాయ అవగాహన సదస్సు

బూర్గంపాడు, నవంబరు 9: బూర్గంపాడు ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో మంగళవారం న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు. జాతీయ న్యాయ సేవా సంస్ధ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ జూనియర్‌ కళాశాల విద్యార్ధులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జిల్లా న్యాయ సేవా సంస్ధ సెక్రటరీ జావిద్‌పాషా మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి చట్టాలపై కనీస అవగాహన కలిగి ఉండాలని సూచించారు. కార్యక్రమంలో భద్రాచలం మొదటిశ్రేణి న్యాయమూర్తి సురేష్‌, ఎస్‌ఐ సముద్రాల జితేందర్‌, న్యాయవాదులు ముత్యాల కిషోర్‌, జయరాజు, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.


Updated Date - 2021-11-10T04:48:21+05:30 IST