న్యాయవాది కుటుంబానికి రక్షణ కల్పించాలి

ABN , First Publish Date - 2021-08-22T04:34:57+05:30 IST

కొత్తగూడెం కోర్టులో ప్రాక్టీస్‌ చేస్తున్న సీనియర్‌ న్యాయవాది, జలసూత్రం శివరాం ప్రసాద్‌కు ఇచ్చిన కేసులో న్యాయం జరగడం లేదంటూ అ న్యాయవాది ఇంట్లో వారందన్ని బయటకు రానివ్వకుండ ధర్నా నిర్వహించి వారిపై దౌర్జన్యం చేసిన సదరు వ్యక్తులపై కఠినచర్యలు తీసుకోవాలని భద్రాద్రి జిల్లా ఎస్పీ సునిల్‌ దత్‌ను కొత్తగూడెం బార్‌ అసోసియేషన్‌ సభ్యులు కోరారు.

న్యాయవాది కుటుంబానికి రక్షణ కల్పించాలి
వినతిపత్రం సమర్పిస్తున్న న్యాయవాదులు

ఎస్పీని కోరిన ‘బార్‌’ సభ్యులు

కొత్తగూడెం పోస్టాఫీస్‌ సెంటరు, ఆగస్టు 21: కొత్తగూడెం కోర్టులో ప్రాక్టీస్‌ చేస్తున్న సీనియర్‌ న్యాయవాది, జలసూత్రం శివరాం ప్రసాద్‌కు ఇచ్చిన కేసులో న్యాయం జరగడం లేదంటూ అ న్యాయవాది ఇంట్లో వారందన్ని బయటకు రానివ్వకుండ ధర్నా నిర్వహించి వారిపై దౌర్జన్యం చేసిన సదరు వ్యక్తులపై కఠినచర్యలు తీసుకోవాలని భద్రాద్రి జిల్లా ఎస్పీ సునిల్‌ దత్‌ను కొత్తగూడెం బార్‌ అసోసియేషన్‌ సభ్యులు కోరారు. శనివారం ఎస్పీ కార్యాలయంలో ఎస్పీతో మాట్లాడి ఆ న్యాయవాదిపై అసాంఘీక శక్తుల ప్రోద్బలంతో ఎస్సీ,ఎస్టీ కేసు పెడ తానని బెదిరిస్తున్నారని తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు. న్యాయవాదిని బెదిరిస్తున్న వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని వారు కోరారు. న్యాయ వ్యవస్థకు విఘాతం కలిగించేలా జరుగుతున్న ఇలాంటి పరిణామాల పట్ల పోలీసు శా ఖ కఠినంగా వ్యవహరించాలని వారు ఎస్పీని కోరారు. సంఘటనపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షులుఉ లక్కినేని సత్యనారాయణ, ఉపాధ్యక్షులు తోట మల్లేశ్వరరావు, బార్‌ కౌన్సిల్‌ మెంబర్‌ కొల్లి సత్యనారాయణ, సీనియర్‌న్యాయవాదులు జీవీకే. మనోహర్‌, పోసాని కృష్ణమూర్తి, గాజుల రామ్మూర్తి, అనుబ్రోలు రాం ప్రసాద్‌, మారపాక రమేష్‌, జియో, మహిళా న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-08-22T04:34:57+05:30 IST