తెలంగాణ ఉద్యమకారుల ఫోరం వెబ్‌సైట్‌ ఆవిష్కరణ

ABN , First Publish Date - 2021-12-28T05:57:52+05:30 IST

నగంలోని అమరవీరుల స్థూపం వద్ద సోమవారం తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో వెబ్‌సైట్‌ను ఆవిష్కరించారు.

తెలంగాణ ఉద్యమకారుల ఫోరం వెబ్‌సైట్‌ ఆవిష్కరణ

ఖమ్మంచర్చికాంపౌండ్‌, డిసెంబరు27: నగంలోని అమరవీరుల స్థూపం వద్ద సోమవారం తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో వెబ్‌సైట్‌ను ఆవిష్కరించారు. ఫోరం రాష్ట్ర చైర్మన్‌ డాక్టర్‌ చీమ శ్రీనివాస్‌ ఈ ఆవిష్కరణ జరిపారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యమకారుల త్యాగాల మీద ఏర్పడిన రాష్ట్రంలో ఉద్యమకారులకు తీవ్రమైన అన్యాయం జరిగిందన్నారు. ఉద్యమకారులకు సంక్షేమబోర్డు ఏర్పాటుచేసే ప్రయత్నం కూడా చేయడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఉద్యమకారులంతా ఒకేతాటిపైకి వచ్చి  హక్కుల సాధనకై ఉద్యమించాలని కోరారు. రాష్ట్రసాధనకోసం ఉద్యమకారులు చేసిన ఉద్యమ వవరాలను పోరాటాలను ఈవెబ్‌సైట్‌లో పొందు పరిచామని తెలిపారు. ఈ కార్యక్రమంలో  ఫోరం ఉమ్మడిజిల్లా చైర్మన్‌ డాక్టర్‌ కేవీ కృష్ణారావు, ఉమ్మడి నల్గొండ జిల్లాచైర్మన్‌ అనంతుల మధు, పాలకుర్తి కృష్ణ, రడం సురేష్‌, బానోతు బద్రునాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-12-28T05:57:52+05:30 IST