2న జిల్లాకు కేటీఆర్‌

ABN , First Publish Date - 2021-12-28T06:43:29+05:30 IST

2న జిల్లాకు కేటీఆర్‌

2న జిల్లాకు కేటీఆర్‌

పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు

పాల్గొననున్న మంత్రులు అజయ్‌, సత్యవతి రాథోడ్‌

ఖమ్మం, డిసెంబరు27 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): కొత్త ఏడాదిలో ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులు పర్యటించనున్నారు. రాష్ట్ర పురపాలక, ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌తోపాటు రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌, గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌.. జనవరి2న ఖమ్మం, సత్తుపల్లి నియోజకవర్గాల్లో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమా లకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. మంత్రి కేటీఆర్‌ రెండో తేదీన హైదరాబాద్‌ నుంచి హెలీకాప్టర్‌లో బయల్దేరి ఉదయం 10గంటలకు ఖమ్మం చేరుకుని, రఘునాథపాలెంలో గిరిజన సంక్షేమశాఖ ఎక్స్‌లెన్స్‌ రెసిడెన్షియల్‌ పాఠశాల భవనానికి శంకుస్థాపన చేస్తారు. 10.40గంటలకు ఖమ్మం ఐటీహబ్‌ సర్కిల్‌లో ఫుట్‌పాత్‌, లకారం ట్యాంక్‌బండ్‌లో తీగలవంతెనను ప్రారంభించి, ఖమ్మం కార్పొరేషన్‌ పరిధిలోని పేదలకు ఇళ్లపట్టాల పంపిణీ చేయనున్నారు. అనంతరం 11.20గంటలకు చర్చికాంపౌండ్‌లో ఆధునికీకరించిన కూడలిని ప్రారంభిస్తారు. ప్రకాష్‌నగర్‌ 17వడివిజన్‌లో ఎస్టీపీ గోళ్లపాడు చానల్‌పై మురగునీరు శుద్ధి ప్రాజెక్టు పనులకు శంకుస్థాపన, దానవాయిగూడెంలో మానవవ్యర్థాల శుద్ధీకరణ ప్రాజెక్టు పనులకు శంకుస్థాపన చేస్తారు. 12.30గంటలకు కలెక్టరేట్‌లో ఖమ్మం మునిసిపల్‌ కార్పొరేషన్‌లో అభివృద్ధిపై సమీక్షలో పాల్గొంటారు. 3.45 గంటలకు కల్లూరు మండలం పోచారంలో దివంగత మాజీ ఎమ్మెల్యే కట్టా వెంకటనర్సయ్య విగ్రహాన్ని ఆవిష్కరించి తిరిగి హైదరాబాద్‌ వెళతారు.

Updated Date - 2021-12-28T06:43:29+05:30 IST