కేటీపీఎస్‌ ఏడో దశలో విద్యుత్‌ ఉత్పత్తి పునరుద్దరణ

ABN , First Publish Date - 2021-10-21T05:19:40+05:30 IST

బాయిలర్‌ ట్యూబ్‌ సమస్యతో గత వారం నిలిచిపోయిన పాల్వంచలోని కొత్తగూడెం ధర్మల్‌ పవర్‌ స్టేషన్‌ (కేటీపీఎస్‌)ఏడోదశలో అధికారులు విద్యుత్‌ ఉత్పత్తిని పునరుద్దరించారు.

కేటీపీఎస్‌ ఏడో దశలో విద్యుత్‌ ఉత్పత్తి పునరుద్దరణ

పాల్వంచ, అక్టోబరు 20: బాయిలర్‌ ట్యూబ్‌ సమస్యతో గత వారం నిలిచిపోయిన పాల్వంచలోని కొత్తగూడెం ధర్మల్‌ పవర్‌ స్టేషన్‌ (కేటీపీఎస్‌)ఏడోదశలో అధికారులు విద్యుత్‌ ఉత్పత్తిని పునరుద్దరించారు. 800 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి సామర్ధ్యం కలిగిన ఈ యూనిట్‌ పది రోజుల్లో రెండు సార్లు నిలిచిపోవటంతో చీఫ్‌ ఇంజనీర్‌ పలుకుర్తి వెంకటేశ్వరరావు నేతృత్వంలో మరమ్మతులు నిర్వహించారు. బుధవారం తెల్లవారుజామున 3గంటలకు సింక్రనైజేషన్‌ అధికారులు పూర్తిచేసి విద్యుదుత్పత్తిని అనుసంధానించారు. 


Updated Date - 2021-10-21T05:19:40+05:30 IST