టీఆర్‌ఎస్‌ ఉమ్మడి ఖమ్మం నేతల సమావేశం నేటికి వాయిదా

ABN , First Publish Date - 2021-01-21T04:58:44+05:30 IST

హైదరాబాద్‌ ప్రగతిభవన్‌లో టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ అధ్యక్షతన బుధవారం జరగాల్సిన ఉమ్మడి ఖమ్మంజిల్లా టీఆర్‌ఎస్‌ ముఖ్యనేతల సమావేశం వాయిదా పడింది.

టీఆర్‌ఎస్‌ ఉమ్మడి ఖమ్మం నేతల సమావేశం నేటికి వాయిదా

ఖమ్మం, జనవరి 20 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి) : హైదరాబాద్‌ ప్రగతిభవన్‌లో టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ అధ్యక్షతన బుధవారం జరగాల్సిన ఉమ్మడి ఖమ్మంజిల్లా టీఆర్‌ఎస్‌ ముఖ్యనేతల సమావేశం వాయిదా పడింది. కేటీఆర్‌ సూచన మేరకు సమావేశాన్ని గురువారం నిర్వహించనున్నారు. ఈ మేరకు సమాచా రాన్ని ఉమ్మడి జిల్లా నేతలకు ఫోన్‌లో అం దించారు. ఈ సమావేశానికి మంత్రి పువ్వాడ అజయ్‌, మాజీమంత్రి తుమ్మల నాగేశ్వర రావు, ఎంపీ నామ నాగేశ్వరరావు, మజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మె ల్యేలు, మునిసిపల్‌ చైర్మన్లు, జడ్పీచైర్మన్లు, డీసీసీబీ, డీసీఎంఎస్‌ చైర్మన్లు హాజరుకానున్నారు.

Updated Date - 2021-01-21T04:58:44+05:30 IST