19 మంది డీటీలకు జిల్లాల కేటాయింపు
ABN , First Publish Date - 2021-04-01T06:26:50+05:30 IST
ఏడాది క్రితం టీఎస్‌పీఎస్సీ గ్రూప్ 2 ద్వారా నేరుగా ఎంపికైన 19మంది నాయబ్ తహసీల్దార్లకు జిల్లాలను కేటాయిస్తూ సీసీఎల్‌ఏ నుంచి బుధవారం రాత్రి ఉత్తర్వులు వెలువడ్డాయి.
ఎనిమిది మంది ఖమ్మం జిల్లాకు, పది మంది భద్రాద్రికి..
మహబూబాబాద్ జిల్లాకు ఒక్కరి కేటాయింపు
ఖమ్మం కలెక్టరేట్, మార్చి 31: ఏడాది క్రితం టీఎస్‌పీఎస్సీ గ్రూప్ 2 ద్వారా నేరుగా ఎంపికైన 19మంది నాయబ్ తహసీల్దార్లకు జిల్లాలను కేటాయిస్తూ సీసీఎల్‌ఏ నుంచి బుధవారం రాత్రి ఉత్తర్వులు వెలువడ్డాయి. గతేడాది రాష్ట్రవ్యాప్తంగా 210మంది నాయబ్ తహసీల్దార్లు (డీటీ) గ్రూప్ 2 నుంచి ఎంపికయ్యారు. వారిలో 19మంది ఉమ్మడి ఖమ్మం జిల్లాకు శిక్షణ కోసం వచ్చారు. గతేడాది జూలై 22న ఖమ్మంలో శిక్షణకు వచ్చిన నాయబ్ తహసీల్దార్లకు ఏడాది పాటు శిక్షణ ఇచ్చారు. ఈ నేపథ్యం లో శిక్షణ కాలం పూర్తవ్వడంతో వారిని జిల్లాలకు కేటా యిస్తూ సీసీఎల్‌ఏ నుంచి ఉత్తర్వులు విడుదలయ్యాయి. ఖమ్మం జిల్లాకు 8 మంది, భద్రాద్రికొత్తగూడెం జిల్లాకు 10, మహబూబాబాద్ జిల్లాకు ఒకరిని కేటాయించారు.
ఖమ్మం జిల్లాలో పోస్టింగులు కేటాయింపు
నాయబ్ తహసీల్దార్లుగా శిక్షణ పొంది ఖమ్మం జిల్లాకు కేటాయించిన 8మందికి కలెక్టర్ ఆర్వీకర్ణన్ బుధవారం రాత్రి పోస్టింగులను కల్పిస్తూ ఆదేశాలు జారీ చేశారు. గుర్రం సుధీర్‌కు సత్తుపల్లి, కుందూరు లక్ష్మీ సింగరేణి, ఎర్రయ్య రాగం వేంసూరుకు, గుర్రపు అరుణకు చింతకాని, బత్తిని శ్రీలతకు వైరా, ఎండీ ఆరీఫ్ రెహమాన్‌కు పెనుబల్లి, డి కుసుమశ్రీకి ఖమ్మం రూరల్, ఆమనగంటి వనజకు నేలకొండపల్లి తహసీల్దారు కార్యాలయాల్లో పోస్టింగులు కల్పిస్తూ ఉత్తర్వులు విడుదల చేశారు.