పారిశుధ్య నిర్వహణలో ఖమ్మం అగ్రగామి

ABN , First Publish Date - 2021-08-22T05:01:39+05:30 IST

అభివృద్ధి, పారిశుధ్య నిర్వహణలో ఖమ్మం అగ్రగామిగా ఉందని, అదే స్ఫూర్తిని కొనసాగించాలని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ పేర్కొన్నారు.

పారిశుధ్య నిర్వహణలో ఖమ్మం అగ్రగామి
పారిశుధ్య జవాన్లకు సైకిళ్ల పంపిణీ చేస్తున్న మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌

 అదేస్ఫూర్తిని కొనసాగించాలి

రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌

పారిశుధ్య జవాన్లకు సైకిళ్ల పంపిణీ 

ఖమ్మం కార్పొరేషన్‌, ఆగస్టు 21: అభివృద్ధి, పారిశుధ్య నిర్వహణలో ఖమ్మం అగ్రగామిగా ఉందని, అదే స్ఫూర్తిని కొనసాగించాలని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ పేర్కొన్నారు. శనివారం నగరంలోని పెవిలియన్‌ గ్రౌండ్‌లో నగరపాలక సంస్థ పారిశుధ్య జవాన్లకు సైకిళ్ల పంపిణీని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నగరంలో సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా పారిశుధ్య పనులను ముమ్ము రంగా నిర్వహించాలని చెప్పారు  మొత్తం 60 డివిజన్లలోని జవాన్లకు 60 సైకిళ్లు అందచేస్తున్నామన్నారు. అభివృద్ధి, పారిశుధ్య నిర్వహణలో ఖమ్మం అగ్రగామిగా ఉందని, అదే స్ఫూర్తిని కొనసాగిం చాలని కోరారు. జవాన్లు ప్రతిరోజు తమ డివిజన్లలో పర్యటిస్తూ పారిశుద్ధ్యాన్ని మెరుగుపరిచి, సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం మంత్రి పువ్వాడ డీఆర్‌ఎఫ్‌, విద్యుత్‌ సిబ్బందికి యూనిఫారాలని అందచేశారు.

చెత్తసేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి 

నగరంలోని 41వ డివిజన్‌ వైరారోడ్‌లో వాణజ్య, వ్యాపార సముదాయాల నుండి చెత్తను సేకరించే కార్యక్రమాన్ని మంత్రి పువ్వాడ జెండా ఊపి ప్రారంభిం చారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ చెత్త సేకరణ, పొడి,తడి చెత్త వేరుచేసే కార్యక్రమాన్ని ఎకోటిక్‌ సంస్థకు అప్పగించామన్నారు. దీనివల్ల వాణిజ్య ప్రాంతాల్లో చెత్త పేరుకు పోదన్నారు. అంతేకాకుండా చెత్తను రీసైక్లింగ్‌ చేస్తారని, దీంతో చెత్తను డంపింగ్‌ యార్డుకు తరలించే పని ఉండదన్నారు.

పట్టణ ప్రగతివనం నిర్వహణ పక్కాగా ఉండాలి

నగర ప్రజల ఆహ్లాదానికి, సంపూర్ణ ఆరోగ్యానికి అన్ని హంగులతో ఏర్పాటు చేసుకున్న ప్రకృతివనం నిర్వహణ పక్కాగా ఉండాలని మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ కోరారు. నగరంలోని 17వ డివిజన్‌ శ్రీనివాసనగర్‌లో రూ.50 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన పట్టణ ప్రగతి వనాన్ని మేయర్‌ పునుకొల్లు నీరజతో కలిసి ప్రారంభిం చారు. ప్రకృతివనంలో ఏర్పాటు చేసిన ఓపెన్‌ జిమ్‌, పిల్లల ఆటల పరికరాలను మంత్రి సందర్శించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ఆహ్లాదంతో పాటు ఆరోగ్యాన్ని పంచే ప్రకృతి వనాన్ని అధికారులతో పాటు, ప్రజా ప్రతినిధులు క్రమం తప్పకుండా పర్యవేక్షిం చాలన్నారు. గ్రీనరీ రక్షణ చర్యలు నిరంతరం జరగాలని మంత్రి పువ్వాడ సూచించారు. ఈ కార్యక్రమాల్లో ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మినారాయణ, నగరపాలక సంస్థ కమిషనర్‌ అనురాగ్‌ జయంతి, మేయర్‌ పునుకొల్లు నీరజ, ఉపమేయర్‌ ఫాతి మా జోహారా, సహాయ కమిషనర్‌ బీ. మల్లీశ్వరి, మార్కెట్‌ కమిటీ ఛైర్మన్‌ లక్ష్మీప్రసన్న, కార్పోరేటర్లు  పాల్గొన్నారు. 

 మంత్రికి అమ్మవారి విగ్రహం బహూకరణ

ఖమ్మంఖానాపురంహవేలి: శ్రావణమాసంలో వరలక్ష్మి అమ్మవారి ఆశీస్సులతో ప్రతి ఒక్కరి ఇంట అష్ట ఐశ్వర్యాలు తులతూగాలని మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ అన్నారు. శనివారం ఖమ్మం పౌరసమితి, మహాత్మగాంధీ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో మంత్రికి ప్రత్యేకంగా తయారుచేయించిన లక్ష్మి అమ్మవారి ప్రతిమను బహకురించారు.ఈ కార్యక్రమంలో పులిపాటి ప్రసద్‌, కొత్త వెంకటేశ్వరరావు, కీసర పద్మజారెడ్డి, రాధాకృష్ణమూర్తి, వరప్రసాద్‌, బసవపున్నయ్య పాల్గొన్నారు.

Updated Date - 2021-08-22T05:01:39+05:30 IST