కల్యాణ మండపంగా ఖమ్మం పాత బస్టాండ్
ABN , First Publish Date - 2021-03-21T05:38:01+05:30 IST
నగరంలో మయూరిసెంటర్ సమీపంలోని పాత బస్టాండ్‌ను ఆర్టీసీ కల్యాణమండపంగా మార్చనున్నారు.

ఖమ్మం కార్పొరేషన్, మార్చి 20: నగరంలో మయూరిసెంటర్ సమీపంలోని పాత బస్టాండ్‌ను ఆర్టీసీ కల్యాణమండపంగా మార్చనున్నారు. ఈనెల 27న రాష్ట్ర పురపాలక, ఐటీశాఖ మంత్రి కేటీఆర్ ఎన్నెస్పీ క్యాంప్ స్థలంలో నిర్మించిన నూతన బస్టాండ్‌ను ప్రారంభించనున్నారు. ఇక పాత బస్టాండ్‌ను ఆర్టీసీ కల్యాణ మండపంగా మారుస్తామని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ తెలిపారు. ఈ కళ్యాణ మండపంలో పేద, మధ్య తరగతి కుటుంబాలు శుభకార్యాలు జరుపుకొనే విధంగా అందుబాటులో ఉంచుతామని మంత్రి పేర్కొన్నారు. దీనివల్ల ఆర్టీసీ సంస్థకు ఆదాయం రావటమే కాకుండా, పేద, మధ్యతరగతి వర్గాలకు అబ్ధి చేకూరనుందని మంత్రి అజయ్‌కుమార్ పేర్కొన్నారు.