కాకతీయ.. కాల్వ ఏదయా?
ABN , First Publish Date - 2021-07-19T05:28:44+05:30 IST
అధికారుల నిర్లక్ష్యంతో మిషన్ కాకతీయ పథకం రైతులకు శాపంగా మారింది. ఫలితంగా పంటపొ లాలకు సాగునీరు అందని పరిస్థితి నెలకొంది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగేళ్ల నుంచి ఇదే పరిస్థితి ఉన్నా అధికారులు పట్టించుకోకపోవడంతో రైతుల బాధ వర్ణణాతీతంగా ఉంది.
తూము నిర్మాణంతోనే సరిపుచ్చిన కాంట్రాక్టర్
అది కూడా లోపభూయిష్టంగానే..కాల్వ నిర్మాణంలో నిర్లక్ష్యం
ఆయకట్టుకు అందని సాగునీరు.. అన్నదాతల అవస్థలు
ఆళ్లపల్లి జూలై 18: అధికారుల నిర్లక్ష్యంతో మిషన్ కాకతీయ పథకం రైతులకు శాపంగా మారింది. ఫలితంగా పంటపొ లాలకు సాగునీరు అందని పరిస్థితి నెలకొంది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగేళ్ల నుంచి ఇదే పరిస్థితి ఉన్నా అధికారులు పట్టించుకోకపోవడంతో రైతుల బాధ వర్ణణాతీతంగా ఉంది. మిషన్ కాకతీయలో భాగంగా మర్కోడులో చెరువు అభివృద్ధి పనులు చేపట్టారు. పర్యవేక్షించాల్సిన అధికారుల చూసి చూడనట్టు వదిలేయడంతో కాంట్రాక్టర్ అనాలో చితంగా తూమును నిర్మిం చారు. కాల్వ పూర్తి చేయకుండా వదిలేశారు. దాంతో ఆయకట్టు రైతుల సాగుకు నీరు అందక నానా అవస్థలు పడుతున్నారు. ఓ ప్రముఖ అధికార పార్టీ నాయకుడు చెప్పడంతోనే కాంట్రాక్టర్ తూమును నిర్మించినట్టు ఆరోపణలున్నాయి. తూము ఉన్నా కాల్వ లేకపోవడంతో నీరు ఎలా పారుతుందని రైతులు అంటున్నారు. తూము లోప భూయిష్టంగా నిర్మించడంతో అందులో నుంచి నీరు బయటకు వెళ్లకుండా రైతులు నానా అవస్థలు పడతున్నారు.