చట్టాలపై అవగాహన ఉండాలి
ABN , First Publish Date - 2021-10-25T04:51:26+05:30 IST
ప్రతిఒక్కరూ చట్టాలపై అవగాహన కలిగినప్పుడే దేశ సౌరభౌమాధికారం సిద్దిస్తుందని కొత్తగూడె ం అదనపు సీనియర్ సివిల్ న్యాయమూర్తి శ్రీనివాస్ అన్నారు.
అదనపు సీనియర్ సివిల్ న్యాయమూర్తి శ్రీనివాస్
కొత్తగూడెం టౌన్, అక్టోబరు 24: ప్రతిఒక్కరూ చట్టాలపై అవగాహన కలిగినప్పుడే దేశ సౌరభౌమాధికారం సిద్దిస్తుందని కొత్తగూడె ం అదనపు సీనియర్ సివిల్ న్యాయమూర్తి శ్రీనివాస్ అన్నారు. ఆదివారం మండల లీగల్ సర్వీసెస్ కమిటీ కొత్త గూ డెం ఆధ్వర్యంలో రామవరం సత్యసాయి సేవా సమితి హాల్‌లో ఐక్యరాజ్యసమితి దినోత్సవం సందర్బంగా న్యాయచైతన్య సద స్సును నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిఽథిగా వి చ్చేసిన న్యాయమూర్తి మాట్లాడుతూ.. ప్రపంచదేశాల మధ్య శాంతిని నెలకొల్పేందుకు 24 అక్టోబరు 1945న ఐక్యరాజ్యస మితిని స్థాపించారని, ప్రతి దేశంలో స్త్రీలకు ఉన్న హక్కులను రక్షించేందుకు అనేక చట్టాలకు రూపకల్పన చేశారన్నారు. అ జాద్ క అమృత్ మహోత్సవం ద్వారా గ్రామాల్లో న్యాయ అవగా హన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారన్నారు. విధ్యార్ధినీలకు న్యాయ వ్యవస్థలో ఉన్న సివిల్, క్రిమినల్ కేసులపై అవగాహన కల్పించారు. బాలికలు వారికున్న సందేహాలను నివృత్తి చేసు కుంటూ ఉన్నత శిఖరాలను అదిరోహించాలని కోరారు. రూ. లక్ష లోపు వార్షిక ఆదాయం కలిగిన మహిళలు, వృద్దులు, దివ్యాంగులకు న్యాయపరమైన సమస్యలుంటే మండల లీగల్ సర్వీసెస్ కమిటీ కొత్తగూడెం వారికి ధరఖాస్తుచేస్తే న్యాయం చే స్తామని హామీ ఇచ్చారు. సీనియర్ న్యాయవాధి రమేష్ మక్కడ్ ఐక్యరాజ్య సమితి ఆవిర్బావం, విధులు, ప్రపంచ ఆరోగ్య సంస్థ గురించి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో మానిట రింగ్ కమిటీ మెంబర్ రాజముల్లు, న్యాయవాధి, మాజీ కౌన్సిలర్ వెంకటేశ్వర్లు, పార లీగల్ వాలంటరీ రాజమణి, లక్ష్మి, టూటౌన్ ఎస్.సెల్వరాజు, తదితరులు పాల్గొన్నారు.