వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి

ABN , First Publish Date - 2021-02-06T04:09:02+05:30 IST

విద్యార్థులు వ్యక్తిగత పరిశుభ్రతకు ప్రాధాన్యమివ్వాలని విద్యాశాఖా జాయింట్‌ డైరెక్టన్‌ శ్రీనివాసాచారి తెలిపారు.

వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి
కూసుమంచిలో విద్యార్థులతో మాట్లాడుతున్న జేడీ

 భౌతికదూరం పాటించాలి, మాస్కులు తప్పనిసరి

విద్యాశాఖ జాయింట్‌డైరెక్టర్‌ శ్రీనివాసాచారి


కూసుమంచి, ఫిబ్రవరి5: విద్యార్థులు వ్యక్తిగత పరిశుభ్రతకు ప్రాధాన్యమివ్వాలని విద్యాశాఖా జాయింట్‌ డైరెక్టన్‌ శ్రీనివాసాచారి తెలిపారు. శుక్రవారం కూసుమంచి, మల్లేపల్లి ఉన్నత పాఠశాలలను, గంగబండతండ వద్ద కేజీబీవీనీ సందర్శించారు. తరగతి గదులను పరిశీలించారు. అనంతరం జేడీ మాట్లాడుతూ భౌతికదూరం పాటించాలని, మాస్కులు తప్పనిసరిగా ధరించాలని సూచించారు. విద్యారులు ఎవరికివారే పరిశుభ్రత పాటించాలని సూచించారు. తరచూ చేతులు సబ్బుతో కడుక్కోవాలని సూచించారు.


ఆన్‌లైన్‌లో పాఠాలు విన్నారా అంటూ విద్యార్ధులను ప్రశ్నించారు. విద్యారుల హాజరుశాతం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. కేజీబీవీలో వంటగదులను పరిశీలించారు. భోజనసమయంలోనూ భౌతికదూరం పాటించాలని తెలిపారు. పదోతరగతి విద్యార్ధులు ఈనాలుగు నెలలూ కష్టపడి చదవాలని సూచించారు. ఉపాధ్యాయుల కొరత ఉన్నచోట ప్రాధమిక పాఠశాల నుంచి తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎంఈవో రామాచారి, హెచ్‌ఎం నర్సింహమూర్తి, శ్రీనివాస్‌, ఏవో అజితకుమారి తదితరులు పాల్గొన్నారు.


ముదిగొండ: మండలంలోని గోకినపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాల, న్యూలక్ష్మీపురంలోని కేజీబీవీ పాఠశాలలను విద్యాశాఖా జాయింట్‌ డైరెక్టన్‌ శ్రీనివాసాచారి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. చదువుపై శ్రద్ధ చూపాలని చెప్పారు.

ఎప్పటికప్పుడు చేతులను శుభ్రం చేసుకోవాలన్నారు. ఆన్‌లైన్‌లో పాఠాలు విన్నారా, ఉపాధ్యాయులు ఎలా బోధించారంటూ విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల హాజరు రిజిస్ట్రర్లను పరిశీలించారు. మండలంలోని అన్ని పాఠశాలల్లో మధ్యాహ్నభోజన సమయంలో కూడా కొవిడ్‌ నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకోవాలని ఎంఈవో బాణాల వెంకట రామాచారిని ఆదేశించారు. కార్యక్రమం లో కేజీబీవీ స్పెషలాఫీసర్‌ ఇందిర, ప్రధానోపాధ్యాయుడు నాగరాజు పాల్గొన్నారు.

Updated Date - 2021-02-06T04:09:02+05:30 IST