జమలాపురం ఆలయ చైర్మన్‌గా కృష్ణమోహన్‌శర్మ
ABN , First Publish Date - 2021-02-16T04:32:40+05:30 IST
తెలంగాణ తిరుపతిగా ప్రసిద్ధిగాంచిన జమలాపురం శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయ వంశపారంపర్య ధర్మకర్తలమండలి చైర్మన్‌గా ఉప్పల కృష్ణమోహన్‌శర్మ నియమితులయ్యారు.
ఎర్రుపాలెం, ఫిబ్రవరి 15: తెలంగాణ తిరుపతిగా ప్రసిద్ధిగాంచిన జమలాపురం శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయ వంశపారంపర్య ధర్మకర్తలమండలి చైర్మన్‌గా ఉప్పల కృష్ణమోహన్‌శర్మ నియమితులయ్యారు. సోమవారం ఆలయ కార్యనిర్వహణ అఽధికారి కె.జగన్మోహన్‌రావు ఆధ్వర్యంలో ప్రమాణస్వీకారం చేశారు. చైర్మన్ మాట్లాడుతూ ఆలయ అభివృద్ధికి తనవంతు కృషిచేస్తానని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు ఉప్పల శ్రీనివా్‌సశర్మ, సూపరింటెండెంట్ శ్రీనివాస్, సీనియర్ అసిస్టెంట్ విజయకుమారి, సిబ్బంది సోమయ్య పాల్గొన్నారు.