గంజాయి కేసులో నిందితుడికి పదేళ్ల జైలు
ABN , First Publish Date - 2021-10-30T05:05:14+05:30 IST
కల్లూరు పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి అక్రమ రవాణాకు సంభంధించి నమోదైన కేసులో నిందితుడి 10 ఏళ్లు జైలు శిక్ష రూ. లక్ష జరిమానా విధిస్తూ ఖమ్మం మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి శుక్రవారం తీర్పు ఇచ్చారు.

తీర్పు చెప్పిన ఖమ్మం మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి
నిందితుడు విశాఖ పట్టణం జిల్లా ఎర్రవరం వాసి
కల్లూరు,అక్టోబరు 29: కల్లూరు పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి అక్రమ రవాణాకు సంభంధించి నమోదైన కేసులో నిందితుడి 10 ఏళ్లు జైలు శిక్ష రూ. లక్ష జరిమానా విధిస్తూ ఖమ్మం మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి శుక్రవారం తీర్పు ఇచ్చారు. విశాఖపట్టణం జిల్లా యలమంచిలి మండలం ఎర్రవరానికి చెందిన తంగేటి కుశరాజు అనే వ్యక్తి 2016 సెప్టెంబర్ నెల 17 వతేదిన గంజాయి అక్రమ రవాణా చేస్తూ పోలీసులకు చిక్కాడు. ఈసంఘటనలకు సంభందించి అప్పటిలో కేసు నమోదైంది. కాగా అతడిపై నేరం రుజువైనందున ఖమ్మం మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి చంద్రశేఖరప్రసాద్ పై విధంగా తీర్పు చెప్పారు. నిందితుడి శిక్ష పడేలా సహకరించిన ఎస్సై రఫీ, కోర్టు కానిస్టేబుళ్లు జాన్‌పాషా, శ్రీనివాసరావు, రంగారావు, ఇతర సిబ్బందిని సీఐ కరుణాకర్ అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గంజాయి,ఇతర మాదకద్రవ్యాలు అక్రమ రవాణాకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకొంటామన్నారు. అలాంటి వ్యక్తుల గురించి సమాచారం అందిస్తే గోప్యంగా ఉంచుతామని తెలిపారు.