నిర్మాణ పనుల్లో వేగం పెంచాలి

ABN , First Publish Date - 2021-07-13T04:53:06+05:30 IST

గిరిజన సంక్షేమ శాఖ ఇంజనీరింగు విభాగం ద్వారా గతంలో ఉమ్మడి జిల్లాలో చేపట్టిన నిర్మాణ పనుల్లో వేగం పెంచి గడువులోపు పూర్తి చేయాలని సంబంధిత ఇంజనీరింగ్‌ అధికారులను భద్రాచలం ఐటీడీఏ పీవో పి.గౌతమ్‌ ఆదేశించారు.

నిర్మాణ పనుల్లో వేగం పెంచాలి
సమీక్ష నిర్వహిస్తున్న పీవో

భద్రాచలం ఐటీడీఏ పీవో గౌతమ్‌

గిరిజన సంక్షేమ శాఖ ఇంజనీరింగ్‌ విభాగంపై సమీక్ష

భద్రాచలం, జూలై 12: గిరిజన సంక్షేమ శాఖ ఇంజనీరింగు విభాగం ద్వారా గతంలో ఉమ్మడి జిల్లాలో చేపట్టిన నిర్మాణ పనుల్లో వేగం పెంచి గడువులోపు పూర్తి చేయాలని సంబంధిత ఇంజనీరింగ్‌ అధికారులను భద్రాచలం ఐటీడీఏ పీవో పి.గౌతమ్‌ ఆదేశించారు. సోమవారం ఐటీడీఏ సమావేశ మందిరంలో ఖమ్మం జిల్లాల ఇంజనీరింగ్‌ డీఈలు, ఏఈలు, అధికారులతో నిర్మాణ పనులపై అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని మోడల్‌ స్కూల్‌ బిల్డింగ్‌, పోస్టుమెట్రిక్‌ హాస్టల్స్‌, ఆశ్రమ పాఠశాలల్లో అదనపు తరగతి గదుల నిర్మాణం, గ్రౌండ్‌ రైలింగ్‌ కాంపౌండ్‌ వాల్స్‌ , టాయిలెట్స్‌, బాత్‌రూముల గురించి సంబంధిత పనులను మండలాల వారీగా సంబంధిత డీఈలు, ఏఈలను అడిగి తెలుసుకున్నారు. వారికి గడువు లోపు పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. 

విద్యార్ధులకు ఆన్‌లైన్‌ క్లాసులపై ఐటీడీఏ పీవో సమీక్ష

భద్రాచలం ఐటీడీఏ పరిధిలోని గిరిజన పాఠశాలల్లో ఆన్‌లైన్‌ క్లాసుల నిర్వహణపై పీవో గౌతమ్‌ సమీక్షించారు. ఈ సమావేశంలో ఆన్‌లైన్‌ క్లాసులు విద్యార్థులకు అర్దమవుతున్నాయా లేదా క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేయాలని సంబంధిత అధికారులను పీవో ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డీడీ రమాదేవి, పీఎంఆర్‌సీ రమణయ్య పాల్గొన్నారు.


Updated Date - 2021-07-13T04:53:06+05:30 IST