మాదకద్రవ్యాలను అరికట్టడం అందరి బాధ్యత

ABN , First Publish Date - 2021-11-21T05:52:17+05:30 IST

మాదకద్రవ్యాలను అరికట్టడంలో యువత బాధ్యత వహించాల్సి ఉందని కల్లూరు ఏసీపీ ఎన్‌.వెంకటేష్‌ అన్నారు.

మాదకద్రవ్యాలను అరికట్టడం అందరి బాధ్యత

  యువతకు ఏసీపీ వెంకటేష్‌ పిలుపు

సత్తుపల్లి, నవంబరు 20: మాదకద్రవ్యాలను అరికట్టడంలో యువత బాధ్యత వహించాల్సి ఉందని కల్లూరు ఏసీపీ ఎన్‌.వెంకటేష్‌ అన్నారు. శనివారం మండలంలోని కొత్తూరు మదర్‌థెరిస్సా ఇంజనీరింగ్‌ కళాశాలలో సత్తుపల్లి పోలీస్‌ శాఖ ఆధ్వర్యంలో శనివారం మాదకద్రవ్యాలు-అనర్ధాలపై అవగాహన సదస్సు ఏర్పాటుచేశారు. డ్రగ్స్‌ వ్యవహారంలో యువత పూర్తిగా సహకరిస్తూ తమకు సమాచారం ఇస్తే మంచి సమాజాన్ని నిర్మించవచ్చునన్నారు. వ్యసనాల కారణంగా తల్లీదండ్రులతో పాటు కుటుంబాలు చిన్నాబిన్నమవుతున్నట్లు చెప్పారు. మాదకద్రవ్యాలకు అలవాటు పడితే కలిగే అనర్ధాలు చాలా ఉన్నాయన్నారు. వయా సత్తుపల్లి నుంచి గంజాయి రవాణా అవుతున్న క్రమంలో విశ్వసనీయ సమాచారం మేరకు పట్టుకున్నట్లు చెప్పారు. గంజాయి, డ్రగ్స్‌, హెరాయిన్‌పై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని అన్నారు. ఒరిస్సా, వైజాగ్‌, నర్సీపట్నం తదితర ప్రాంతాలనుంచి గంజాయిని వయా సత్తుపల్లి ద్వారా ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారన్నారు. 

అలరించిన మిమిక్రీ రమేష్‌

ప్రముఖ మిమిక్రీ ఆర్టిస్ట్‌ రమేష్‌ విద్యార్థులను అలరించారు. పేదరికం నుంచి ఉన్నతస్థాయికి ఎదిగిన వారి జీవితాలను మిమిక్రీ ఈవెంట్‌ రూపంలో వివరిస్తూ ఆలోజింపజేశారు. మధ్యమధ్యలో మన సాంపద్రాయాన్ని వివరించే పాటల ఆలపించడం... సినీ ఆర్టిస్టుల గొంతుతో డైలాగ్స్‌తో ఉర్రూతలూగించారు. కార్యక్రమంలో మిస్ట్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ సీ.హరికృష్ణ, సత్తుపల్లి రూరల్‌ సీఐ టీ.కరుణాకర్‌, ఎస్‌ఐ బీ.రామూనాయక్‌, ప్రవేట్‌ కళాశాలల నిర్వహకులు జీవీ.లింగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-11-21T05:52:17+05:30 IST