వ్యవసాయ మార్కెట్‌ కమిషన్‌ లైసెన్స్‌ల అందజేత

ABN , First Publish Date - 2021-12-26T04:20:53+05:30 IST

ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో కమిషన్‌ వ్యాపారం కోసం గతంలో లైసెన్స్‌ల కోసం దరఖాస్తులు చేసుకున్న వారికి రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ శనివారం వీడీవోస్‌ కాలనీలోని తన క్యాంప్‌ కార్యాలయంలో అందించారు.

వ్యవసాయ మార్కెట్‌ కమిషన్‌ లైసెన్స్‌ల అందజేత

ఖమ్మం కార్పొరేషన్‌,డిసెంబరు 25: ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో కమిషన్‌ వ్యాపారం కోసం గతంలో లైసెన్స్‌ల కోసం దరఖాస్తులు చేసుకున్న వారికి రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ శనివారం వీడీవోస్‌ కాలనీలోని తన క్యాంప్‌ కార్యాలయంలో అందించారు. రఘునాధ పాలెం మండలానికి చెందిన 9మంది గతంలో లైసెన్స్‌ కోసం దరఖాస్తు చేశారు. అవి పెండింగ్‌లో పడ్డాయి. ఈ విషయాన్ని మార్కెట్‌ కమిటీ ఛైర్మన్‌ లక్ష్మీప్రసన్న మంత్రి పువ్వాడ దృష్టికి తేగా, ఆయన ప్రత్యేక చొరవ తీసుకొని, సంబంధితశాఖ మంత్రి దృష్టికి తీసుకువెళ్లి లైసెన్స్‌లు మంజూరు చేయించారు. శనివారం వాటిని అందచేశారు. ఈ కార్యక్రమంలో రఘునాధపాలెం మండల టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు అజ్మీరా వీరునాయక్‌, 24వ డివిజన్‌ కార్పోరేటర్‌ కమర్తపు మురళి పాల్గొన్నారు.

Updated Date - 2021-12-26T04:20:53+05:30 IST