ఇంటిదారి పట్టిన కళాశాల హాస్టల్ విద్యార్థినులు
ABN , First Publish Date - 2021-02-02T04:16:08+05:30 IST
ప్రభుత్వం సోమవారం నుంచి తరగతులు ప్రారంభించగా సత్తుపల్లిలోని బాలికల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో హాస్టల్ విద్యార్థినీలు మాత్రం ఇంటిబాట పట్టారు.

అనుమతి లేదనడంతో వెనుదిరిగిన వైనం
సత్తుపల్లిరూరల్, ఫిబ్రవరి 1: ప్రభుత్వం సోమవారం నుంచి తరగతులు ప్రారంభించగా సత్తుపల్లిలోని బాలికల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో హాస్టల్ విద్యార్థినీలు మాత్రం ఇంటిబాట పట్టారు. ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థినులకు వసతి సౌకర్యం కల్పించకూడదనే నిబంధన తమ జిల్లా అధికారుల నుంచి స్పష్టంగా రావడంతో తాము నిరాకరించామని హాస్టల్ వార్డెన్లు చెప్పారు. దీంతో అటు కళాశాల సమయం దాటిన తర్వాత ఎక్కడ ఉండాలో తెలియక 40 మంది విద్యార్థినులు ఇంటిబాట పట్టారు.
బాధాకరం: రజియా సుల్తానా, హాస్టల్ వార్డెన్
తమ కళాశాలలో మొదటి సంవత్సరం చేరేందుకు వచ్చిన సుమారు 40మంది విద్యార్థినులు వసతి లేకపోవడంతో వెనుదిరగడం బాధాకరం. ఈ విషయమై పరిష్కరంచేందుకు ప్రయత్నించాను.