గోదావరిలో శ్రీరామకోటి ప్రతుల నిమజ్జనం

ABN , First Publish Date - 2021-09-03T05:15:00+05:30 IST

రామ భక్తులు ఎంతో భక్తి ప్రపత్తులలో భద్రాద్రి రామయ్యను స్మరిస్తూ రాసిన శ్రీరామకోటి ప్రతులను భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం అధికారులు గురువారం సంప్రదాయబద్దంగా వాటిని గోదావరిలో నిమజ్జనం చేశారు.

గోదావరిలో శ్రీరామకోటి ప్రతుల నిమజ్జనం
శ్రీరామకోటి ప్రతులను గోదావరిలో నిమజ్జనం చేస్తున్న దృశ్యం

భద్రాచలం, సెప్టెంబరు 2: రామ భక్తులు ఎంతో భక్తి ప్రపత్తులలో భద్రాద్రి రామయ్యను స్మరిస్తూ రాసిన శ్రీరామకోటి ప్రతులను భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం అధికారులు గురువారం సంప్రదాయబద్దంగా వాటిని గోదావరిలో నిమజ్జనం చేశారు. ముందుగా శ్రీరామకోటి ప్రతులను లారీల్లో తరలించే ముందు విశ్వక్సేన పూజ, పుణ్యహావచనం, తదితర పూజా కార్యక్రమాలను నిర్వహించగా దేవస్థానం ఏఈవో ఈవో బి.శివాజీ దంపతులు పాల్గొన్నారు. అనంతరం మేళ తాళాలు, వేద పండితుల మంత్రోచ్చారణ, శ్రీరామ భక్తుల నడుమ శ్రీరామ కోటి ప్రతులను భద్రాచలంలోని గోదావరి బ్రిడ్జి మీదకు తీసుకువచ్చారు. ఈ సమయంలో మళ్లీ ప్రత్యేక పూజలను నిర్వహించి ఈవో దంపతులు గోదారమ్మకు పసుపు కుంకుమ, వస్త్రాలను సమర్పించారు. తరువాత శ్రీరామ కోటిప్రతులను శిరస్సుపై ధరించి శాస్ర్తోక్తంగా గోదావరిలో నిమజ్జనం చేశారు. కార్యక్రమంలో దేవస్థానం ఏఈవోలు బి.శ్రావణ్‌కుమార్‌, భవానీ రామకృష్ణ, పర్యవేక్షకులు నిరంజన్‌కుమార్‌, కత్తి శ్రీనివాసు, లింగాల సాయిబాబా, కిషోర్‌, దేవస్థానం ప్రదాన అర్చకులు పొడిచేటి సీతారామానుజాచార్యులు, వేద పండితులు గుదిమెళ్ల మురళీకృష్ణమాచార్యులు, లింగాల రామకృష్ణ ప్రసాద్‌, ఆస్థాన పురోహితులు చెన్నావజ్జుల వెంకటేశ్వర అవధాని, వైదిక, పరిపాలన సిబ్బంది పాల్గొన్నారు. 

Updated Date - 2021-09-03T05:15:00+05:30 IST