ఐకేపీ కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలి

ABN , First Publish Date - 2021-11-09T06:19:08+05:30 IST

తక్షణమే ఐకేపీ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి రైతులను ఆదుకోవాలని జిల్లా బీజేపీ అధ్యక్షుడు గల్లా సత్యనారాయణ డిమాండ్‌ చేశారు.

ఐకేపీ కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలి
కలెక్టరేట్‌ ఎదుట ఆందోళన చేస్తున్న బీజేపీ నాయకులు

 ఖమ్మం కలెక్టరేట్‌ ఎదుట కిసాన్‌మోర్చా దీక్ష
ఖమ్మం బైపాస్‌రోడ్డు, నవంబరు 8:
తక్షణమే ఐకేపీ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి రైతులను ఆదుకోవాలని జిల్లా బీజేపీ అధ్యక్షుడు గల్లా సత్యనారాయణ డిమాండ్‌ చేశారు. ధాన్యం కొనుగోలు విషయంలో ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ బీజేపీ ఆధ్వర్యంలో కిసాన్‌మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్‌రెడ్డి పిలుపుమేరకు సోమవారం ఖమ్మం నగరంలోని కలెక్టరెట్‌ ఎదుట కిసాన్‌మోర్చా రైతుదిక్ష నిర్వహించారు. బీజేపీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు గల్లా సత్యనారాయణ మాట్లాడుతూ వరిసాగు చేస్తే రైతులకు ఉరి తప్పదంటూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ మాట్లా డుతున్న తీరు చాలా దారుణమన్నారు. కేంద్ర ప్రభుత్వం వరిపంటకు మద్దతు ప్రకటించి రైతు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యాన్ని కేంద్ర పభుత్వం తీసుకుంటుం దని చేప్పిఆన రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడం రైతులను వేదించడమేనన్నారు. ధాన్యం కొనుగోళ్లలో గోనె సంచులు, పురుకొసకు కూడా కేంద్ర ప్రభుత్వమే డబ్బు చెల్లిస్తోందని, రైతుల వద్ద ఒడ్లు కొనుగోలు చేసి పెట్టినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి రెండు శాతం కమీషన్‌ కూడా కేంద్ర ప్రభుత్వమే చెల్లిస్తోందన్నారు. అనంతరం కిసాన్‌ మోర్చా జిల్లా అధ్యక్షులు చావా కిరణ్‌, బీజేపీ జిల్లా ఇంచార్జ్‌ కడగంచి రమేష్‌ మాట్లాడుతూ రైతుల వద్ద చిట్టచివరి  ధాన్యపు గింజ కూడా రాష్ట్ర ప్రభుత్వం కొనుగో లు చేసేవారకు రైతుల పక్షాన పోరాటం చేస్తామన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ దేశ సైనికులను అవమానపరిచేలా మాట్లాడటం ఆయన దిగజారుడుతనానికి నిదర్శనమన్నా రు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా సహఇంచార్జ్‌ విద్యాసాగర్‌ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కార్పొరేటర్‌ డి.సత్యనారయ ణ, కిసాన్‌మోర్చా రాష్ట్రకార్యవర్గ సభ్యులు సోమగారి ఎల్లారావుగౌడ్‌, తిరుపతి రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి శ్యామ్‌ రాథోడ్‌, రుద్రప్రదీప్‌, ఉప్పల శారద, విద్యాసాగర్‌, వాసుదేవరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-11-09T06:19:08+05:30 IST