పల్లెప్రగతి ఎలా నడుస్తోంది
ABN , First Publish Date - 2021-07-09T05:03:39+05:30 IST
‘‘పల్లెప్రగతి ఎలా నడుస్తోంది.. సమస్యలు ఏమైనా ఉన్నాయా... పారిశుధ్యం కార్యక్రమాలు.. మెక్కలు నాటే కార్యక్రమం బావుండాలి... ఎక్కడా సమస్యలు ఉత్పన్నం కావద్దు ’’ అని రాష్ట్ర పంచాయతీరాజ్ కమీషనర్ రఘునందన్‌రావు సూచించారు.

కలెక్టర్, డీపీవోను అడిగితెలుసుకున్న
పంచాయతీరాజ్ కమీషనర్ రఘునందన్‌రావు
ఖమ్మం కలెక్టరేట్, జూలై8: ‘‘పల్లెప్రగతి ఎలా నడుస్తోంది.. సమస్యలు ఏమైనా ఉన్నాయా... పారిశుధ్యం కార్యక్రమాలు.. మెక్కలు నాటే కార్యక్రమం బావుండాలి... ఎక్కడా సమస్యలు ఉత్పన్నం కావద్దు ’’ అని రాష్ట్ర పంచాయతీరాజ్ కమీషనర్ రఘునందన్‌రావు సూచించారు. గురువారం ఆయన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటించి హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణంలో ఖమ్మంలో ఆగారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయానికి వచ్చారు. ఈసందర్భంగా కలెక్టర్ ఆర్వీకర్ణన్, జడ్పీ సీఈవో ప్రియాంక పంచాయతీరాజ్ కమీషర్‌కు పుష్పగుచ్చాలిచ్చి స్వాగతం పలికారు. అనంతరం తేనీటి విందు స్వీకరించారు. ఈసందర్భంగా జిల్లా పంచాయతీ అధికారి వాసిరెడ్డి ప్రభాకర్‌రావు, జిల్లా వ్యవసాయశాఖ అధికారిణి విజయలక్ష్మీ, డీఆర్డీవో విద్యాచందన, హర్టీకల్చర్ అధికారిణి అనసూర్య తదితరులు కమీషనర్‌ను కలిసారు. ఈసందర్భంగా డీపీవోని పల్లెప్రగతి ఎలా నడుస్తోంది. పల్లెల్లో, పట్టణాల్లో పారిశుద ్యం బాగుపడాలి అని సూచించారు. ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. జిల్లా వ్యవసాయశాఖ అధికారి విజయలక్ష్మీని రైతు వేధికలు అన్ని పూర్తయ్యాయా.. ఎలా నడిపిస్తున్నారు. వేదికల్లో రైతులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారా అని అడిగారు. ఏడీఏలు, ఏవోలు సిబ్బంది అందుబాటులో ఉంటున్నారా అని ప్రశ్నించారు. డీ ఆర్డీవో విద్యాచందనను ఈజీఎస్ పనులు చేస్తున్నారా.. ఎన్ని కూలీలు చెల్లించారు.. ఏమైనా పెండింగ్‌లో ఉన్నాయా అని అడిగితెలుసుకున్నారు. సుమారు గంట సేపు ఆయన కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో గడిపి అధికారులతో సమీక్షించి వెళ్లిపోయారు.