అప్పులు చెల్లించలేదని ఇళ్ల జప్తు

ABN , First Publish Date - 2021-02-07T05:19:56+05:30 IST

జీవనోపాధి కోసం అప్పు తీసుకున్న గిరిజనులు, నిరుపేదలను గడువు తీరినా బకాయిలు చెల్లించడంలేదని ఇళ్లను, ఇంట్లో వస్తువులను బ్యాంకు అధికారులు జప్తు చేశారు.

అప్పులు చెల్లించలేదని ఇళ్ల జప్తు
మద్దులపల్లి గ్రామంలో ఓ ఇంటికి సీల్‌ వేస్తున్న బ్యాంక్‌ అధికారులు

వన్‌ టైం సెటిల్‌మెంట్‌లో డీసీసీబీ అధికారులు

అవకాశం ఇవ్వాలంటూ కూలీల వేడుకోలు 

ససేమీరా అంటున్న అధికారులు

అప్పు కడితేనే ఆస్తుల విడుదల

కామేపల్లి, ఫిబ్రవరి 6: జీవనోపాధి కోసం అప్పు తీసుకున్న గిరిజనులు, నిరుపేదలను గడువు తీరినా బకాయిలు చెల్లించడంలేదని ఇళ్లను, ఇంట్లో వస్తువులను బ్యాంకు అధికారులు జప్తు చేశారు. ఈ సంఘటన ఖమ్మం జిల్లా కామేపల్లి మండల పరిధిలోని అడవిమద్దులపల్లి, బాసిత్‌నగర్‌, లాల్యతండాలో జరిగింది. బాదితులు తెలిపిన వివరాల ప్రకారం కామేపల్లి మండల పరిధిలోని గ్రామాలలో సుమారు 500మంది యువకులు, వ్యవసాయ కూలీలతో కేంద్ర సహకార బ్యాంక్‌లో జాయింట్‌ లచబులిటీ గ్రూప్స్‌ ను క్రియేట్‌ చేసి ఐదుగురు సభ్యులతో ఓ గ్రూప్‌ను తయారు చేశారు. ఆ గ్రూప్‌కు ఒక్కరికి పది వేల చొప్పున అప్పు ఇచ్చారు. ఆ అప్పును నెల నెలా చెల్లించాలని యువకులకు సూచించారు. మొదట్లో కొన్ని రోజులు ఆ యువకులు కొంత మొత్తం చెల్లించుకుంటూ వచ్చారు. ఈ అప్పులు కూడా మాఫీ అవుతాయని కొంత మంది రాజకీయ నేతలలో చెప్పడంతో వ్యవసాయ కూలీలు చెల్లించడం వదిలేశారు. ఆ బకాయిలు పేరుకుపోయాయి.బ్యాంక్‌ అధికారులు బకాయిలు చెల్లించాలని నోటీసులు జారీ చేశారు. అయితే శనివారం మండల పరిధిలోని అడవిమద్దులపల్లి, లాల్యతండ, బాసిత్‌నగర్‌ గ్రామాలలో ముప్పై మంది బ్యాంక్‌ సిబ్బంది, పోలీసుల సహకారంతో వారి ఇండ్ల వద్దకు వెళ్ళి బకాయిలు చెల్లించని వ్యవసాయ కూలీల ఇండ్లు, వాహనాలు, ధాన్యం బస్తాలు, కుర్చీలు, టేబుల్‌ ప్యాన్లు, ఇంట్లో ఉన్న సామగ్రిని జప్పు చేశారు. బకాయిలు వెంటనే చెల్లించిన వ్యవసాయ కూలీలకు వారి సామాగ్రిని వారికి ఇచ్చేశారు. రెండు రోజులుల్ల్లో కడతామని వేడుకున్న వారి మాటలను పట్టించుకోకుండా, కట్టిన తరువాతే జప్పులను విడుదల చేస్తామని అధికారులు తేల్చి చెప్పారు. దీంతో వారు కన్నీటి పర్యమైన అప్పులు తీర్చారు. నీరుపేద వ్యవసాయ కూలీల ఇండ్లను, వాహనాలను వ్యానుల్లో ఎక్కిస్తుండగా సీపీఎం  మండలఅధ్యక్షుడు అంబటీ శ్రీనివాసరెడ్డి నేతృత్వంలో అడ్డుకున్నారు.


Updated Date - 2021-02-07T05:19:56+05:30 IST