అర్హులందరికీ ఇళ్లస్థలాలు ఇవ్వాలి :గ్రామీణ పేదల సంఘం ఆధ్వర్యంలో భారీ ప్రదర్శన

ABN , First Publish Date - 2021-01-21T05:10:03+05:30 IST

అర్హులందరికీ ఇళ్లస్థలాలు ఇవ్వాలి :గ్రామీణ పేదల సంఘం ఆధ్వర్యంలో భారీ ప్రదర్శన

అర్హులందరికీ ఇళ్లస్థలాలు ఇవ్వాలి :గ్రామీణ పేదల సంఘం ఆధ్వర్యంలో భారీ ప్రదర్శన
ఖమ్మం నగరంలో ప్రదర్శన నిర్వహిస్తున్న దృశ్యం

గ్రామీణ పేదల సంఘం, యూసీసీఆర్‌ఐ ఎంల్‌ పార్టీ ఆధ్వర్యంలో భారీ ప్రదర్శన

ఖమ్మం మయూరిసెంటర్‌, జనవరి 20: జిల్లాలో అర్హులైన పేదలందరికి ప్రభుత్వం స్థలంతోపాటు ఇల్లు కట్టి ఇవ్వాలని, భూస్వాముల అక్రమ స్వాధీనంలో ఉన్న అన్ని రకాల భూములను పేదలకు పంచాలని, ఆక్రమణకు గురైన వక్ప్‌బోర్డు  భూములను వెలికి తీసి పేద ముస్లిం కుటుంబాలకు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ గ్రామీణ పేదల సంఘం, యూసీసీఐఆర్‌ ఎంల్‌ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం ఖమ్మం నగరంలో భారీ ప్రదర్శన నిర్వహించారు. ఈ ప్రదర్శన పెవిలియన్‌ గ్రౌండ్‌ నుంచి వైరా రోడ్‌ మీదుగా ధర్నా చౌక్‌ వరకు సాగింది అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో గ్రామీణ పేదల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పడిగ యర్రయ్య, ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ సంస్థ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్‌ జతిన్‌కుమార్‌లు మా ట్లాడుతూ నగరంలోని వెలుగుమట్లలో వినోభానగర్‌కాలనీ వాసులకు హైకోర్టు తీర్పు ప్రకారం అన్ని వసతులు కల్పించాలని డిమాండ్‌ చేశారు. నగరంలో కళాకారులు ప్రదర్శన ఆకట్టుకుంది. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి వెంకటాద్రి, సహాయ కార్యదర్శి పోలెబోయిన ముత్తయ్య, జిల్లా కన్వీనర్‌ కల్తీ రామయ్య, బాణాల లక్ష్మణాచారి, నర్సింహచారి, లెనిన్‌,బాబు పాల్గొన్నారు.   

Updated Date - 2021-01-21T05:10:03+05:30 IST