ఏజెన్సీ వైద్యుల సేవలు మరువలేనివి

ABN , First Publish Date - 2021-12-20T04:51:30+05:30 IST

భద్రాచలం ఏజెన్సీలోని ప్రజలకు ప్రభుత్వ, ప్రయివేటు వైద్యులు అందిస్తున్న సేవలు మరువలేనివని రాష్ట్ర మాజీ మంత్రి, టీఆ ర్‌ఎస్‌ సీనియర్‌ నాయకులు తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు.

ఏజెన్సీ వైద్యుల సేవలు మరువలేనివి
ఆసుపత్రిని ప్రారంభిస్తున్న తుమ్మల నాగేశ్వరరావు

మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

భద్రాచలం, డిసెంబరు 19: భద్రాచలం ఏజెన్సీలోని ప్రజలకు ప్రభుత్వ, ప్రయివేటు వైద్యులు అందిస్తున్న సేవలు మరువలేనివని రాష్ట్ర మాజీ మంత్రి, టీఆ ర్‌ఎస్‌ సీనియర్‌ నాయకులు తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఆదివారం భద్రాచలంలోని జాబిల్లి వైద్యశాలను, శస్త్ర చికిత్స గదులను మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరారవు, భద్రాచలం పొదెం వీరయ్య, టీఆర్‌ఎస్‌ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ డాక్టర్‌ తెల్లం వెంకట్రావు ప్రారంభించారు. ఈసందర్భంగా తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ మూడు రాష్ట్రాల కూడలిలో ఉన్న భద్రాచలంలో వైద్యసేవలు మరింత మెరుగుపడాలని ఆకాంక్షించారు. అలాగే భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతంలో వైద్య సేవలు మరింత మెరుగుపడాల్సిన అవసరం ఎంతో ఉందని, ఈ క్రమంలో మరో వైద్యశాల ఏజెన్సీ కేంద్రమైన భద్రాచలంలో ఏర్పాటు కావడం ముదావాహమన్నారు. అనంతరం మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్యే పొదెం వీరయ్యను ఆసుపత్రి వైద్యులు, యాజమాన్యం ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో  పోతినేని సుదర్శన్‌, అన్నవరపు కనకయ్య, బోదెబోయిన బుచ్చయ్య, బండారు శరత్‌బాబు, ఎస్‌ఎ రసూల్‌, నక్కా ప్రసాద్‌, సరెళ్ల నరేష్‌,  కొడాలి శ్రీను, పుల్లయ్య, శ్రీని వాసరెడ్డి, ఎస్కే అజీం పాల్గొన్నారు. ఇదిలా ఉండగా ఆశ్రమ పాఠశాలల్లో, కళాశాలల్లో పౌష్టికాహారం సరిగా అందకుండా అవినీతికి పాల్పడుతున్న విధానంపై విచారణ చేసి చర్యలు తీసుకోవాలని గోండ్వానా సంక్షేమపరిషత్‌ రాష్ట్ర కన్వీనరు సోందె వీరయ్య మాజీ మంత్రి తుమ్మలను కోరారు. ఈమేరకు ఆయన భద్రాచలం వచ్చిన తుమ్మలను కలిసి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో కల్లూరి శ్రీను, గడ్డం వెంకన్నబాబు, పాయం సన్యాసి, ముద్దరాజు, రామకృష్ణ పాల్గొన్నారు.

Updated Date - 2021-12-20T04:51:30+05:30 IST