ఘనంగా ప్రారంభమైన భద్రాద్రి హాకీ లీగ్స్‌

ABN , First Publish Date - 2021-12-19T05:30:00+05:30 IST

హాకీ భద్రాద్రి కొత్తగూడెం ఆధ్వర్యంలో ఆదివారం రామచంద్ర ప్రభు త్వ డిగ్రీ కళాశాల క్రీడామైదానంలో హాకీ పోటీలు ఘనంగా ప్రారంభమైయ్యాయి.

ఘనంగా ప్రారంభమైన భద్రాద్రి హాకీ లీగ్స్‌
పోటీలను ప్రారంభిస్తున్న జీఎం పర్సనల్‌ బసవయ్య

కొత్తగూడెం పోస్టాఫీస్‌ సెంటర్‌, డిసెంబరు 19: హాకీ భద్రాద్రి కొత్తగూడెం ఆధ్వర్యంలో ఆదివారం రామచంద్ర ప్రభు త్వ డిగ్రీ కళాశాల క్రీడామైదానంలో హాకీ పోటీలు ఘనంగా ప్రారంభమైయ్యాయి. హాకీ లీగ్స్‌ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా సింగరేణి జీఎం పర్సనల్‌ అండ్‌ సీఎస్‌ఆర్‌ బ సవయ్య హాజరై మాట్లాడారు.  విద్యార్థులు క్రీడలతోపాటు చ దువుకు సైతం సమాన ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ప్రభుత్వం కల్పించిన క్రీడా రిజర్వేషన్‌ను చక్కగా చదువుకోవడం ద్వారా ఉన్నతమైన ఉద్యోగాలు సాధించుకోవడానికి ఉపయోగించుకో వాలన్నారు. అనంతనం నూతనంగా ఏర్పాటైన భద్రాద్రి జిల్లా హకీ కార్యవర్గాన్ని జిల్లా ఓలింపిక్‌ అసోసియేషన్‌ కార్యదర్శి మహీదర్‌, కోశాధికారి రాజేంద్ర ప్రసాద్‌ శాలువాలతో సన్మా నించారు ఈ కార్యక్రమంలో హాకీ జిల్లా అధ్యక్షులు ఉమంది ఉదయ్‌కుమార్‌, చైర్మన్‌ పల్లపు శ్రీనివాస్‌, కార్యదర్శి భట్టు ప్రేమ్‌కుమార్‌, కోశాధికారి ఎస్‌కే. ఇమామ్‌, ఉపాధ్యక్షులు లగడపాటి రమేష్‌, సంయుక్త కార్యదర్శి బి. పవన్‌కుమార్‌, టెక్నికల్‌ కమిటీ సభ్యురాలు రాధ, మహిళా హాకీ క్లబ్‌ అధ్యక్షు రాలు కృష్ణవేణి, తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-12-19T05:30:00+05:30 IST