న్యాయవాదుల సమస్యల పరిష్కారానికి కృషి

ABN , First Publish Date - 2021-10-07T06:13:06+05:30 IST

న్యాయవాదుల సమస్యల పరిష్కారానికి కృషి

న్యాయవాదుల సమస్యల పరిష్కారానికి కృషి
మహిళ న్యాయవాదుల బార్‌ అసోసియేషన్‌ హాల్‌ను ప్రారంభిస్తున్న హైకోర్టు న్యాయమూర్తి శ్రీదేవి

హైకోర్టు న్యాయమూర్తి శ్రీదేవి

ఉమ్మడి జిల్లా న్యాయమూర్తుల కాన్ఫరెన్స్‌కు హాజరు

ఖమ్మం లీగల్‌, అక్టోబరు 6: న్యాయవాదుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హైకోర్టు న్యాయమూర్తి శ్రీదేవి పేర్కొన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా న్యాయమూర్తుల కాన్ఫరెన్సుకు హాజరయ్యేందుకు బుధవారం ఖమ్మం కోర్టుకు వచ్చిన ఆమెకు.. తొలుత జిల్లా ప్రధాన న్యాయమూర్తి సి.హరికృష్ణభూపతి, ఇతర న్యాయమూర్తులు, న్యాయవాద సంఘ కార్యవర్గ బాధ్యులు అర్చకుల వేదమంత్రాల మధ్య పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా జస్టిస్‌ శ్రీదేవి బార్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఆధునికీకరించిన మహిళ న్యాయవాదుల బార్‌ అసోసియేషన్‌ హాల్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా న్యాయవాదులను ఉద్దేశించి ప్రసంగించిన శ్రీదేవి.. సుప్రీంకోర్టు జస్టిస్‌ ఎన్‌.రమణ మహిళా న్యాయవాదులకు 50శాతం రిజర్వేషన్‌ అమలుకు కృషిజరగాలని, న్యాయవాదులు బాగా కష్టపడి పైకిరావాని అన్నారని గుర్తుచేశారు. ఈ జిల్లాలో భద్రాద్రి రాముడు ఉండడం అదృష్టమని.. బతుకమ్మ పండుగ రోజు తాను ఇక్కడికి రావడం పుట్టింటికి వచ్చినట్టుగా ఉందన్నారు. తర్వాత జిల్లా ప్రధాన న్యాయమూర్తి సి.హరేకృష్ణభూపతి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా న్యాయమూర్తులు పి.చంద్రశేఖర ప్రసాద్‌, అరుణకుమారి, డానిరూత్‌, జావీద్‌పాషా, అప్రోజ్‌ అక్తర్‌, అనితారెడ్డి, శాంతిసోనిమౌనిక, పూజిత, రుబీనాఫాతిమా, బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు మలీదు నాగేశ్వరరావు, బార్‌ కౌన్సిల్‌ మెంబర్‌ కొల్లి సత్యనారాయణ, కె.చంద్రశేఖరగుప్తా, గురుమూర్తి, లక్ష్మీనారాయణ, వై.ప్రసాద్‌, కృష్ణారావు, సంపత్‌, ప్రభుత్వ న్యాయవాది డి.కృష్ణారావు, ఉమ్మడి జిల్లాల న్యాయమూర్తులు, బార్‌ అసోసియేషన్‌ కార్యవర్గంతోపాటు న్యాయవాదులు, న్యాయశాఖ ఉద్యోగులు పాల్గొన్నారు. అంతకుముందు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు మలీదు నాగేశ్వరరావు ఆధ్వర్యంలో న్యాయవాదుల సమస్యలతోపాటు కొన్ని కోర్టులకు న్యాయమూర్తులు లేని విషయంపై ఇచ్చిన విజ్ఞప్తి పత్రాల్లోని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని జస్టిస్‌ శ్రీదేవి హామీ ఇచ్చారు. 

Updated Date - 2021-10-07T06:13:06+05:30 IST