పలకరింపులు, పరామర్శలు
ABN , First Publish Date - 2021-07-25T05:10:10+05:30 IST
మండలంలోని పలుగ్రామాల్లో మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటించారు. పల్లపాటి రాజు-ప్రియాంక కూతురు, కుమారుల నూతనవస్త్రాలంకరణ కార్యక్రమంలో పాల్గొని పిల్లలను ఆశీర్వదించారు.

పాలేరు నియోజకవర్గంలో
మాజీ మంత్రి తుమ్మల విస్తృత పర్యటన
కూసుమంచి, జూలై 24: మండలంలోని పలుగ్రామాల్లో మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటించారు. పల్లపాటి రాజు-ప్రియాంక కూతురు, కుమారుల నూతనవస్త్రాలంకరణ కార్యక్రమంలో పాల్గొని పిల్లలను ఆశీర్వదించారు. నాయకన్‌గూడెంలో ఇటీవల మరణించిన రంజాన్ కుటుంబసభ్యులను, జుజ్జలరావుపేటలో సర్పంచి శైలజ భర్త కోటిరెడ్డి మరణించగా కుటుంబసభ్యులను పరామర్శించారు. కార్యక్రమంలో నాయకులు సాధు రమేష్‌రెడ్డి, జొన్నలగడ్డ రవికుమార్, సుధాకర్‌రెడ్డి, రామసాయం వెంకటరెడ్డి, మాదాసు ఉపేందర్, కూరపాటి వేణు పాల్గొన్నారు.
ఖమ్మంరూరల్: మండలంలో చింతపల్లిలో ఇటీవల మరణించిన బుక్కా బొర్రయ్య, చాపల వెంకటేశ్వర్లు, తోట వెంకటయ్య కుటుంబ సభ్యులను పరామర్శించారు. మృతుల చిత్రపటాలకు నివాళులు అర్పించారు. కార్యక్రమంలో యద్దిమల్లారెడ్డి, జగదీష్, తమ్మినేని కృష్ణయ్య, రామ్మూర్తినాయక్, తోటరామారావు పాల్గొన్నారు.
తిరుమలాయపాలెం: మండలంలోని హైదర్‌సాయిపేట మాజీసర్పంచ్ మట్టా రంగయ్య కుటుంబాన్ని , పైనంపల్లికి చెందిన గండ్ర గోపాలరావును తుమ్మల పరామర్శించారు. దమ్మాయిగూడేనికి చెందిన సర్పంచ్ ఆలస్యం నాగేశ్వర రావు తండ్రి ఇటీవల మృతిచెందగా కుటుంబ సభ్యులను పరామర్శించారు. తాళ్లచెరువులో ముక్కపాటి నాగేశ్వర రావు తల్లిఅచ్చమ్మ రాత్రి మృతిచెందగా కుటుంబ సభ్యులను పరామర్శించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ వెంకటరెడ్డి, సొసైటీ చైర్మన్ రామసహాయం నరేష్‌రెడ్డి, టీఆర్‌ఎస్ జిల్లానాయకులు సాధురమేష్‌రెడ్డి, జొన్నలగడ్డ రవి, సర్పంచ్ కొండబాల వెంకటేశ్వర్లు, బండి జగదీష్, మద్దినేని మధు, శాఖమూరి రమేష్ పాల్గొన్నారు.