ఎట్టకేలకు సింగరేణి ఎక్సెప్రెస్‌ హాల్టింగ్‌కు గ్రీన్‌సిగ్నల్‌

ABN , First Publish Date - 2021-08-28T04:58:01+05:30 IST

సింగరేణి ఎక్స్‌ప్రెస్‌ రైలుకు ఎట్టకేలకు కారేపల్లిలో హాల్టింగ్‌ ఇచ్చారు

ఎట్టకేలకు సింగరేణి ఎక్సెప్రెస్‌ హాల్టింగ్‌కు గ్రీన్‌సిగ్నల్‌

కారేపల్లి ఆగస్టు 27: సింగరేణి ఎక్స్‌ప్రెస్‌ రైలుకు ఎట్టకేలకు కారేపల్లిలో హాల్టింగ్‌ ఇచ్చారు రైల్వే అధికారులు. గతనెలలో ప్రారంభం అయిన రైలును అధికారులు కారేపల్లి స్టేషన్‌లో ఆగేందకు అనుమతులు ఇవ్వలేదు. దీంతో పలువురు బీజేపీ, విశ్వహిందు పరిషత్‌ నాయకులు సౌత్‌ సెంట్రల్‌ రైల్వే బోర్డు సభ్యులు మట్టా దుర్గాప్రసాద్‌రెడ్డికి, వైరా ఎమ్మెల్యే రాములునాయక్‌, ఎంపీ నామా నాగేశ్వరరావు దృష్టికి తీసుకపోవడంతో వారు కేంద్ర రైల్వే అధికారుల దృష్టికి తీసుపోయి సింగరేణి ఎక్సెప్రెస్‌ హల్టింగ్‌ కృషి చేశారు. కారేపల్లి మండలానికి చెందిన విశ్వహిందు పరిషత్‌ సభ్యులు దుర్గాప్రసాద్‌ను శుక్రవారం ఖమ్మంలో సన్మానించారు.


Updated Date - 2021-08-28T04:58:01+05:30 IST