పేదల సంక్షేమమే లక్ష్యంగా పథకాలు

ABN , First Publish Date - 2021-08-20T05:37:03+05:30 IST

పేదల సంక్షేమమే లక్ష్యంగా పథకాలు

పేదల సంక్షేమమే లక్ష్యంగా పథకాలు
ర్యాలీలో అభివాదం చేస్తున్న ఎమ్మెల్యే సండ్ర

పేదరికంలో ఉంది ఎక్కువగా దళితులే

తుమ్మల సంప్రదాయాన్ని కొనసాగిస్తా..

ప్రజాసంక్షేమయాత్రలో ఎమ్మెల్యే సండ్ర

300కార్లతో సత్తుపల్లిలో ర్యాలీ

సత్తుపల్లిరూరల్‌, ఆగస్టు 19: ప్రభుత్వం నిరుపేదల సంక్షేమమే లక్ష్యంగా సీఎం కేసీఆర్‌ నేతృత్వంలోని  ప్రభు త్వం పలు పథకాలను అమలుచేస్తోందని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పేర్కొన్నారు. ప్రభుత్వ 

పథకాలకు ప్రచారం కల్పించడంలో భాగంగా సత్తుపల్లిలో నిర్వహించిన ప్రజా సంక్షేమయాత్రను గురువారం ఆయ న ప్రారంభించారు. 300కార్లతో ర్యాలీ నిర్వహించిన సండ్ర అన్ని మండలాల నాయకులతో కలిసి సత్తుపల్లి మీదుగా రామానగరం, బేతుపల్లి, సిద్దారం, తుంబూరు గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా మహిళలు, టీఆర్‌ఎస్‌ అభిమానులు ఎమ్మెల్యేకు స్వాగతం పలికారు. 57ఏళ్లకు ఫించన్‌,  రైతు రుణమాఫీ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ చిత్రపటానికి బేతుపల్లిలో క్షీరాభిషేకం చేశారు. పింఛన్‌ దరఖాస్తులను ఎమ్మెల్యే స్వయంగా స్వీకరించారు. రామానగరం అభివృద్ధికి ఎల్‌ఐసీ ఏజెంట్‌ మస్తాన్‌వలీ రూ.50వేలను ఎమ్మెల్యే చేతులమీదుగా సర్పంచ్‌ వేల్పుల కళావతికి అందజేశారు.  

నిరుపేదల్లో దళితులే అధికం..

గుండె ధైర్యంతో ప్రారంభించిన దళితబంధు పథకం ఎన్నికల కోసం కాదని, సత్తుపల్లిలో కూడా ఈ పథకం అమలు చేస్తుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. నిరుపేదల్లో ఎక్కువగా ఉంది దళితులేనని, పేదలకు కొండంత అండగా ఉన్న ప్రభుత్వానికి కుల, మతాలు అడ్డురావన్నారు. సీఎంఆర్‌ఎఫ్‌ కింద ఒక్క సత్తుపల్లి నియోజకవర్గానికే 2019తర్వాత సుమారు రూ.7కోట్లు ఇచ్చిందని, కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌, ఆసరా ఫించన్లు, రైతుబంధు, రుణమాఫీ పథకాల్లో పేదవారే లబ్ధిపొందుతున్నారన్నారు.న 

తుమ్మల సంప్రదాయాన్ని నిలబెడతా

సత్తుపల్లి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ముందుకు తెచ్చిన మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావు సంప్రదాయాన్ని నిలబెడతానని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీర్య హామీ ఇచ్చారు. పేదరిక నిర్మూలనే లక్ష్యంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్న తెలంగాణలో ప్రజాసంక్షేమం కోసం ప్రభుత్వం ముందుంటుందన్నారు. గ్రామాలాభివృద్ధి కోసం వైకుంఠధామాలు, పల్లెప్రకృతి వనాలు ఏర్పాటు చేయగా ఆసరా ఫించన్లు, రుణమాఫీతో పాటు పథకాలను టీఆర్‌ఎస్‌ కార్యకర్త ఇంటింటికి ప్రచారం చేయాలన్నారు. సింగరేణి సహకారంతో రూ.10లక్షల వ్యయంతో సీసీ రోడ్లు, డ్రైన్లు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. 

Updated Date - 2021-08-20T05:37:03+05:30 IST