నేటి నుంచి గురుకులాలు ప్రారంభం

ABN , First Publish Date - 2021-10-21T05:21:15+05:30 IST

గురుకుల సంక్షేమ వసతిగృహాలు నేటినుంచి ప్రారంభం కానున్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 23ఎస్సీ గురుకులాలను ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ మేరకు గురుకులాలు ప్రా

నేటి నుంచి గురుకులాలు ప్రారంభం

ఉమ్మడి జిల్లాలో 23 ఎస్సీ గురుకులాలు 

ఖమ్మం సంక్షేమవిభాగం, అక్టోబరు 20: గురుకుల సంక్షేమ వసతిగృహాలు నేటినుంచి ప్రారంభం కానున్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 23ఎస్సీ గురుకులాలను ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ మేరకు గురుకులాలు ప్రారంబించాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ, గిరిజన సంక్షేమ, ఏకలవ్య గురుకులాల కార్యదర్శి రోనాల్డ్‌రాజ్‌ బుధవారం జీవో జారీ చేశారు. దీంతో నేటి నుంచి 5వ తరగతి నుంచి ఢిగ్రీ కాలేజీల వరకు గురుకులాలు తలుపులు తెరుచుకొనున్నాయి. విద్యార్థులు,ఉపాధ్యాయులు ప్రత్యేక్ష విధానంలో విద్యాభ్యాసం జరగనుంది. 

కొవిడ్‌ నిబంధనలతో..

కొవిడ్‌ నిబంధనలతో గురుకులాలు ప్రారంభించేందుకు ఆర్‌సీవో ప్రత్యూష ఏర్పాట్లు చేశారు. గురుకులాలకు వచ్చే విద్యార్థులు నేరుగా రావొచ్చు. ఎటువంటి కరోనా వ్యాధి నిర్దారణ పరీక్షలు అవసరం లేదు. అయితే జ్వరంతో ఉన్న విద్యార్థులు మాత్రం పరీక్షలు నిర్వహించుకోవాల్సి ఉంటుంది. కరోనా కారణంగా ఇప్పటి వరకు గురుకులాలకు సెలవులు రావటంతో తరగతులు ప్రారంభం జరిగిన తర్వాత విద్యార్థులకు మరోసారి బేసిక్స్‌ పరిశీలించాలని సర్యూలర్‌లో గురుకులాల కార్యదర్శి రోనాల్డ్‌ రాజ్‌ పేర్కొన్నారు.

Updated Date - 2021-10-21T05:21:15+05:30 IST