సమస్యల పరిష్కారంలో ప్రభుత్వాలు విఫలం: సీపీఎం

ABN , First Publish Date - 2021-07-13T04:56:59+05:30 IST

ప్రజా సమస్యల పరిష్కారంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఘోరంగా వైఫల్యం చెందాయని సీపీఎం రాష్ట్ర నాయకుడు పొన్నం వెంకటేశ్వరరావు ఆరోపించారు.

సమస్యల పరిష్కారంలో ప్రభుత్వాలు విఫలం: సీపీఎం

ముదిగొండ, జూలై 12: ప్రజా సమస్యల పరిష్కారంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఘోరంగా వైఫల్యం చెందాయని సీపీఎం రాష్ట్ర నాయకుడు పొన్నం వెంకటేశ్వరరావు ఆరోపించారు. సోమవారం స్థానిక మచ్చా వీరయ్యభవన్‌లో సీపీఎం మండల విస్తృతస్థాయి సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. నిత్యావసర వస్తువుల ధరలను పెంచి ప్రజలను దోచుకుంటున్నారని విమర్శించారు. ధరలను తగ్గించాలని లేకుంటే సీపీఎం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో నాయకులు చింతలచెర్వు కోటేశ్వరరావు, బండి పద్మ, వాసిరెడ్డి వరప్రసాద్‌, బట్టు పురుషోత్తం, టీఎ్‌స.కల్యాణ్‌, మంకెన దామోదర్‌, రవికుమార్‌, కందిమళ్ల తిరుపతి, వేల్పుల భద్రయ్య, ప్రభావతి, ఎం.పద్మ, కె.ఉపేందర్‌, భాస్కర్‌రావు, సీహెచ్‌.అంజయ్య, ఇరుకు నాగేశ్వరరావు పాల్గొన్నారు.


Updated Date - 2021-07-13T04:56:59+05:30 IST