ప్రభుత్వ వైద్యం భేష్‌

ABN , First Publish Date - 2021-11-10T05:01:20+05:30 IST

ప్రభుత్వం వైద్యం అంటేనే పెదవి విరుస్తున్న ఈ రోజుల్లో ప్రభుత్వం వైద్యం పై నమ్మకం కలిగిస్తున్నారు ఓ ప్రభుత్వ వైద్యురాలు..

ప్రభుత్వ వైద్యం భేష్‌
చర్ల ప్రభుత్వాసుపత్రిలో ప్రసవం అయిన వారికి కేసీఆర్‌ కిట్లు అందజేస్తున్న డాక్టర్‌ మౌనిక

 ఒకే రోజు ఆరు సాధారణ ప్రసవాలు

దగ్గరుండి పురుడు పోసిన చర్ల వైద్యురాలు 

చర్ల, నవంబర్‌ 9: ప్రభుత్వం వైద్యం అంటేనే పెదవి విరుస్తున్న ఈ రోజుల్లో ప్రభుత్వం వైద్యం పై నమ్మకం కలిగిస్తున్నారు ఓ ప్రభుత్వ వైద్యురాలు.. ఇద్దరు వైద్యులు పని చేయాల్సిన 24గంటల వైద్యశాలలో, ఒక్కరే విధులు నిర్వహిస్తూ అందరి మన్ననలు పొందుతున్నారు. అనారోగ్యం, పురుటి నొప్పులు ఎవరి ఏ అవసరం వచ్చినా అర్ధరాత్రి కూడా వైద్యం అందిస్తున్నారు. గతంలో ప్రవేట్‌ వైద్యమే మేలన్న వారినోటనే ప్రభుత్వం వైద్యం భేష్‌ అనిపిస్తున్నారు. ఆమే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం సత్యనారాయణపురం ప్రభుత్వ వైద్యశాల వైద్యురాలు డాక్టర్‌ మౌనిక. పేదలకు మెరుగైన వైద్యం అందిచడంలో ఆమె ఎల్లప్పుడూ ముందుంటున్నారు. వైద్యశాలకు వచ్చే వారికి మెరుగైన వైద్యం అందిస్తున్నారు. దీంతో అనేకమంది వైద్య పరీక్షలు చేయించుకుని మందులు తీసుకుంటున్నారు. అలాగే ఈమెపై నమ్మకంతో గర్భిణి మహిళలు కూడా అధిక సంఖ్యంలో వస్తున్నారు. తాజాగా మంగళవారం ఒకే రోజు ఆరుగురు ఆదివాసీ మహిళలకు ఆమె పురుడు పోశారు. ప్రస్తుతం తల్లి, బిడ్డలు క్షేమంగా ఉన్నారు. అనంతరం వారికి కేసీఆర్‌ కిట్లు అందజేశారు. ఎంతో ఓర్పుతో వైద్యశాలకు వస్తున్న స్థానిక ఆదివాసీలకు వైద్య సేవలు అందిస్తున్న వైద్యురాలు మౌనిక, స్టాఫ్‌నర్స్‌, ఏఎన్‌ఎం, ఆశా కార్యకర్తలను స్థానికులు అభినందిస్తున్నారు. వ్యాధులు ప్రభులుతున్నా అటవీ గ్రామాల్లో ప్రత్యేక వైద్యశిబిరాలు, టీకా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. అలాగే అత్యంత నిరుపేదలకు వైద్యరాలు మౌనిక సొంత నగదు, దుస్తులు ఇచ్చి పేదలను ఆదుకుంటూ అందరి మన్నలను పొందుతున్నారు.

Updated Date - 2021-11-10T05:01:20+05:30 IST