రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
ABN , First Publish Date - 2021-10-30T05:02:41+05:30 IST
రైతుల సంక్షేమమే....ప్రభుత్వ లక్ష్యమని పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు, ఉమ్మడి ఖమ్మం జిల్లా డీసీసీబీ చైర్మన్ కురాకుల నాగభూషణం అన్నారు.
డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, ఎమ్మెల్యే రేగా కాంతారావు
సొసైటీ గోదాముల నిర్మాణానికి భూమి పూజ
బూర్గంపాడు, అక్టోబరు 29: రైతుల సంక్షేమమే....ప్రభుత్వ లక్ష్యమని పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు, ఉమ్మడి ఖమ్మం జిల్లా డీసీసీబీ చైర్మన్ కురాకుల నాగభూషణం అన్నారు. బూర్గంపాడు మండల పరిధిలోని ఇరవెండి, మోరంపల్లిబంజర, బూర్గంపాడులో నిర్మించనున్న సోసైటీ గోదాముల నిర్మాణానికి శుక్రవారం భూమిపూజ నిర్వహించారు. నాబార్డ్ ఎంఎస్‌సి స్కీం ద్వారా ఇరవెండిలో రూ.36.21లక్షలు, మోరంపల్లిబంజరలో రూ.36,06,100, బూర్గంపాడులో రూ.11.60లక్షలతో చేపట్టిన ఆభివృద్ధి పనులకు శంకుస్ధాపన చేశారు. ఈ సందర్భంగా ఇరవెండిలో గోదాం నిర్మాణానికి స్ధల దాత తాళ్లూరి పంచాక్షరయ్యను శాలువతో సత్కరించారు. అనంతరం మోరంపల్లిబంజరకు చెందిన నాగమణి క్యాన్సర్ వ్యాధితో బాధపడుతోంది. దీంతో వైద్య ఖర్చుల నిమిత్తం రూ. నాలుగు లక్షల ఎల్‌వోసి ఆందజేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పొడియం ముత్యాలమ్మ, డీసీసీబీ డైరెక్టర్ తూళ్లూరి బ్రహ్మయ్య, తహసీల్దార్ భగవాన్‌రెడ్డి, సోసైటీ చైర్మన్ బిక్కసాని శ్రీనివాసరావు, వైస్ చైర్మన్ ఆవుల నాగిరెడ్డి, సర్పంచులు కొర్సా లక్ష్మీ, సిరిపురపు స్వప్న, పోతునూరి సూరమ్మ, దివ్యశ్రీ, రామలక్ష్మీ టీఆర్‌ఎస్ మండల ఆద్యక్షుడు గోపిరెడ్డి రమణారెడ్డి, ప్రధాన కార్యదర్శి జక్కం సుబ్రహ్మణ్యం, వర్కింగ్ ప్రెసిడెంట్ జగదీష్, వంశీకృష్ణ, కామిరెడ్డి రామకొండారెడ్డి, సుబ్బరామిరెడ్డి, పెద్దవీర్రాజు, చిన్నపరెడ్డి, లక్ష్మీనారయణరెడ్డి, బాలిరెడ్డి పాల్గొన్నారు.