ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేయాలి

ABN , First Publish Date - 2021-02-27T04:00:29+05:30 IST

గిరిజనుల అబివృద్ధికి ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేయాలని రాష్ట్రంలో గిరిజనుల రిజర్వేషన్‌లను 6 శాతం నుంచి 10 శాతం వరకు పెంచాలని తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర అద్యక్ష కార్యదర్శులు శ్రీరామ్‌ నాయక్‌, ధర్మానాయక్‌లు అన్నారు.

ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేయాలి
మాట్లాడుతున్న శ్రీరామ్‌

గిరిజన సంఘం రాష్ట్ర కార్యదర్శి శ్రీరామ్‌

ఖమ్మం మయూరి సెంటర్‌, ఫిబ్రవరి 26: గిరిజనుల అబివృద్ధికి ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేయాలని రాష్ట్రంలో గిరిజనుల రిజర్వేషన్‌లను 6 శాతం నుంచి 10 శాతం వరకు పెంచాలని తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర అద్యక్ష కార్యదర్శులు శ్రీరామ్‌ నాయక్‌, ధర్మానాయక్‌లు అన్నారు. శుక్రవారం నగరంలోని సుందరయ్య భవనంలో జరిగిన సంఘ సమావేశంలో వారు మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌ ఏడు సంవత్సరాల పాలనలో గిరిజనుల రిజర్వేషన్ల గురించి పట్టించుకోలేదని దీంతో గిరిజనులు విద్యా, వైద్య ఉద్యోగ అవకాశాలు కోల్పోయారని అవేదన వ్యక్తం చేశారు. గతంలో 4 శాతం ఉన్న రిజర్వేషన్‌ ఆరు శాతంకు పెంచారని, కాని టీఆర్‌ఎస్‌ హయాంలో గిరిజనులను పట్టించు కోలేదని అన్నారు. ఇప్పటికైన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్‌ పెంచాలని డిమాండ్‌ చేశారు. కేంద్ర బడ్జేట్‌లో గిరిజనులకు అన్యాయం జరిగిందని, బీజేపీ నాయకులు సోయం బాబురావు లంబాడిలను ఎస్టీ జాబితాలో నుండి తోలగించాలని కులాల మద్య చిచ్చుపెడుతున్న నాయకుడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. గిరిజనులు అనేక సమస్యలతో సతమతమవుతున్నారని అన్నారు. వారి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో సంఘం జిల్లా కార్యదర్శి భూక్య వీరభద్రం, అధ్యక్షుడు బానోత్‌ బాలాజీ, శ్రీను, కృష్ణానా యక్‌, గన్యినాయక్‌, వెంకన్న, భరత్‌, కిషన్‌ తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-02-27T04:00:29+05:30 IST