మౌలాలీకి గణిత యశస్వీ అవార్డు

ABN , First Publish Date - 2021-02-07T04:51:22+05:30 IST

కల్లూరు మండలం పేరువంచ ఉన్నత పాఠశాలకు చెందిన గణిత ఉపాధ్యాయుడు ఎండీ.మౌలాలి రాష్ట్రస్థాయిలో పీబీఆర్‌ గణిత యశస్వి(2020)అవార్డును అందుకున్నారు.

మౌలాలీకి గణిత యశస్వీ అవార్డు

కల్లూరు, ఫిబ్రవరి 6: కల్లూరు మండలం పేరువంచ ఉన్నత పాఠశాలకు చెందిన గణిత ఉపాధ్యాయుడు ఎండీ.మౌలాలి రాష్ట్రస్థాయిలో పీబీఆర్‌ గణిత యశస్వి(2020)అవార్డును అందుకున్నారు. శనివారం హైదరాబాద్‌లో తెలంగాణ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌, అకాడమిక్‌ అచ్యూమెంట్‌ అవార్డ్సు అసోసియేషన్‌ సంస్థ ఏర్పాటుచేసిన కార్యక్రమంలో సంస్థ చైర్మన్‌ జేపీ నాయర్‌ చేతులమీదుగా అవార్డును అందుకున్నారు. దేశస్థాయిలో గణిత బోధనలో ప్రావీణ్యం పొందిన ఉపాధ్యాయుల్లో 12మందిని ఎంపిక చేయగా అందులో ఖమ్మంజిల్లా నుంచి కల్లూరుకు చెందిన గణిత ఉపాధ్యాయుడు మౌలాలి ఒకరిగా ఎంపికయ్యారు. పీఆర్టీయూ మండల అధ్యక్ష, కార్యదర్శులు పాకాల రమేష్‌, షేక్‌.చాంద్‌సాహెబ్‌, రాష్ట్ర, జిల్లా నాయకులు బోబోలు శ్రీనివాసరావు, కృష్ణారావు, హెచ్‌ఎం సుజాత పలువురు మౌలాలిని అభినందించారు.


Updated Date - 2021-02-07T04:51:22+05:30 IST