నిర్మాణాలకు నిధులివ్వండి

ABN , First Publish Date - 2021-10-22T05:17:55+05:30 IST

వైరా నియోజకవర్గంలో రోడ్లు, వంతెనల నిర్మాణాలకు అవసరమైన నిధులివ్వాలని పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుకు వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్‌ విజ్ఞప్తి చేశారు.

నిర్మాణాలకు నిధులివ్వండి

మంత్రి ఎర్రబెల్లికి ఎమ్మెల్యే రాములునాయక్‌ వినతి

వైరా, అక్టోబరు 21: వైరా నియోజకవర్గంలో రోడ్లు, వంతెనల నిర్మాణాలకు అవసరమైన నిధులివ్వాలని పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుకు వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్‌ విజ్ఞప్తి చేశారు. గురువారం హైదరాబాద్‌లో మంత్రిని ఎమ్మెల్యే మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. సింగరేణి మండలంలోని చీమలవారిగూడెం నుంచి పేరుపల్లి వరకు అలాగే జూలూరుపాడు మండలంలోని నల్లబండబోడు నుంచి అనంతారం వరకు, ఏన్కూరు మండలంలోని వయా కేసుపల్లి నుంచి పాపకొల్లు వరకు, ఇల్లెందు ఆర్‌అండ్‌బీ రోడ్డు నుంచి గిద్దవారిగూడెం వరకు రోడ్ల నిర్మాణానికి, అంజనాపురం వద్ద ఏటిపై కాజ్‌వే నిర్మాణానికి నిధులివ్వాలని కోరారు. అసెంబ్లీలో ఇచ్చిన హామీ మేరకు వెంటనే నిధులివ్వాలని మంత్రి ఎమ్మెల్యే కోరారు. సానుకూలంగా స్పందించిన మంత్రి వెంటనే నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.


Updated Date - 2021-10-22T05:17:55+05:30 IST