మిరప రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి

ABN , First Publish Date - 2021-12-26T06:08:56+05:30 IST

మిర్చిలో తెగుళ్ల వల్ల పంట దిగుబడి లేక మండలంలోని రైతులు తీవ్రంగా నష్టపోయారని వారందరిని ఆదుకోవాలని తెలంగాణ రైతు సంఘం నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

మిరప రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి
మిర్చితోటలను పరిశీలిస్తున్న రైతు సంఘం నాయకులు

తెలంగాణ రైతు సంఘం డిమాండ్‌

చండ్రుగొండ, దుమ్ముగూడెంలో విస్తృత పర్యటన

దెబ్బతిన్న మిరప తోటల పరిశీలన

చండ్రుగొండ, డిసెంబర్‌ 25: మిర్చిలో తెగుళ్ల వల్ల పంట దిగుబడి లేక మండలంలోని రైతులు తీవ్రంగా నష్టపోయారని వారందరిని ఆదుకోవాలని తెలంగాణ రైతు సంఘం నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. శనివారం సంఘం మండల కార్యదర్శి ఐలూరి రామిరెడ్డి ఆధ్వర్యంలో నాయకులు గుర్రాయిగూడెం, దుబ్బతండా, పోకలగూడెం, రావికంపాడు, చండ్రుగొండ గ్రామాల్లో  చీడపీడల వల్ల దెబ్బతిన్న మిరప తోటలను పరిశీలిం చారు. అనంతరం చండ్రుగొండలో రైతు నాయకులు మా ట్లాడుతూ ఎకరానికి రూ.లక్ష ఖర్చు చేశారని, తీరా కాపు సమయానికి ఎర్ర నల్లి, నల్ల నల్లితో పాటు ఇతర వైరస్‌లు సోకి తోటలు పూర్తిగా దెబ్బతిన్నాయన్నారు. ఇటు వంటి పరిస్థితి మండల రైతులు ఎప్పుడు ఎదుర్కొలేదన్నారు. వరి, పత్తి పంటలు దిగుబడి లేక ఆర్థిక ఇబ్బందులు పడుతున్నాని, ఇదే సమయంలో మిరప పంటలోనూ నష్టాలు రావడంతో రైతులు మరింత కుంగిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. పంట పరిహారం కోసం ఈ నెల 27న కలెక్టరేట్‌ ఎదుట జరిగే ధర్నాకు రైతులు తరలి రావాలని రైతులకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సం ఘం నాయకులు పెద్దింటి వేణు, రాయి రాజా, మోహన్‌రావు, శ్రీనివాసరెడ్ది పాల్గొన్నారు. 

రైతులను ఆదుకోవాలని 27న ధర్నా

దుమ్ముగూడెం డిసెంబరు 25: మిర్చి రైతులను ఆదుకోవాలని 27న కలెక్టర్‌ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించనున్నట్లు తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర నాయకులు కాసాని ఐలయ్య తెలిపారు. సంఘం ప్రతినిధులు శనివారం మండలంలో దెబ్బతిన్న మిర్చి తోటలను పరిశీలించారు. తామర, నల్లనల్లి, ఎర్రనల్లి వైరస్‌తో నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోని పక్షంలో ఆత్మహత్యలు పెరిగే అవకాశం ఉందన్నారు. ఇప్పటికే ఎకరాకు రూ.లక్ష వరకు పెట్టుబడి పెటిన వేలాది మంది రైతులు తీవ్రంగా నష్టపోయారని తెలిపారు. ధర్నాలో బాధిత రైతులంతా పాల్గొనాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు, రవికుమార్‌, ధర్మ, నాయ కులు సత్యనారాయణ, బొల్లి సూర్యచంద్రరావు, మురళి, రాంబా బు, కృష్ణ, దన్ని నర్సింహారావు, కల్లూరి లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-12-26T06:08:56+05:30 IST