బెస్ట్‌ అవైలబుల్‌ పథకానికి గిరిజన విద్యార్థుల దరఖాస్తు చేసుకోవాలి

ABN , First Publish Date - 2021-07-13T05:27:02+05:30 IST

2021-2022 విద్యా సంవత్సరానికి గాను బెస్ట్‌ అవైలబుల్‌ పథకం ద్వారా ఖమ్మం జిల్లాలో అర్హులైన గిరిజన విద్యార్థినీ విద్యార్థులకు 3,5,8,వ తరగతుల్లో ప్రవేశానికి దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి పి కృష్ణనాయక్‌ తెలిపారు.

బెస్ట్‌ అవైలబుల్‌ పథకానికి  గిరిజన విద్యార్థుల దరఖాస్తు చేసుకోవాలి

ఖమ్మంకలెక్టరేట్‌, జూలై12: 2021-2022 విద్యా సంవత్సరానికి గాను బెస్ట్‌ అవైలబుల్‌ పథకం ద్వారా ఖమ్మం జిల్లాలో అర్హులైన గిరిజన విద్యార్థినీ విద్యార్థులకు 3,5,8,వ తరగతుల్లో ప్రవేశానికి దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి పి కృష్ణనాయక్‌ తెలిపారు. ఈ పథకంలో 3వ తదరగికి 33 సీట్లు, 5వ తరగతికి 16, 8వ తరగతికి 16 సీట్లు మొత్తం 65 సీట్లు ఉన్నాయని దీనికి దరఖాస్తు చేసుకునేందుకు ఈనెల 20లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. లాటరీ పద్దతిన ఎంపికను ఈనెల 29న అంబేద్కర్‌ భవనంలో నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆసక్తి కలిగిన విద్యార్థినీ విద్యార్థులు 20లోగా జిల్లా గిరిజన అభివృద్ధి కార్యాలయం ఖమ్మంలో దరఖాస్తు చేసుకోవాలని ఆయన ఒక ప్రకటనలో కోరారు. 

Updated Date - 2021-07-13T05:27:02+05:30 IST