చెరువులో పడి జాలరి మృతి

ABN , First Publish Date - 2021-08-21T05:19:07+05:30 IST

చేపలుపట్టే వ్యక్తి ప్రమాదవశాత్తూ చెరువులో పడి మృతిచెందిన సంఘటన గురువారం రాత్రి జరిగింది.

చెరువులో పడి జాలరి మృతి

సత్తుపల్లిరూరల్‌, ఆగస్టు 20: చేపలుపట్టే వ్యక్తి ప్రమాదవశాత్తూ చెరువులో పడి మృతిచెందిన సంఘటన గురువారం రాత్రి జరిగింది. శుక్రవారం ఏఎ్‌సఐ జయబాబు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని గంగారానికి చెందిన వాడే వెంకటేశ్వరరావు(55) చేపలు పట్టేందుకు గురువారం గంగారం చెరువుకు వెళ్లాడు. సాయంత్రానికి కూడా ఇంటికి రాకపోవడంతో చెరువు వద్ద చెప్పులు కనిపించాయి. కాగా వల విసిరే క్రమంలో కాలికి వల చుట్టుకుని నీళ్లలో పడగా తూటికాడలు, పిచ్చిమొక్కలో ఇరుక్కోగా రాత్రికి ఆచూకీ లభ్యమైంది. బయటకు తీసి చూడగా అప్పటికే మృతి చెందినట్లు ఏఎ్‌సఐ తెలిపారు. మృతుడికి భార్య తిరుపతమ్మ, కుమారుడు మల్లేశ్వరరావు ఉండగా పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.

Updated Date - 2021-08-21T05:19:07+05:30 IST