శ్రీశైలం అమరులకు తొలి వర్ధంతి నివాళులు

ABN , First Publish Date - 2021-08-22T05:05:16+05:30 IST

గత ఏడాది శ్రీశైలం ఎడమగట్టు జల విద్యుత కేంద్రంలో జరిగిన ప్రమాదంలో అమరులైన తొమ్మిది మంది విద్యుత ఉద్యోగుల తొలి వర్ధంతిని శనివారం పాల్వంచలోని కొత్తగూడెం థర్మల్‌ పవర్‌ స్టేషన్‌

శ్రీశైలం అమరులకు తొలి వర్ధంతి నివాళులు

 పాల్వంచ, ఆగస్టు21: గత ఏడాది శ్రీశైలం ఎడమగట్టు జల విద్యుత కేంద్రంలో జరిగిన ప్రమాదంలో అమరులైన తొమ్మిది మంది విద్యుత ఉద్యోగుల తొలి వర్ధంతిని శనివారం పాల్వంచలోని కొత్తగూడెం థర్మల్‌ పవర్‌ స్టేషన్‌ (కేటీపీఎస్‌) కాంప్లెక్స్‌లో ఘనంగా నిర్వహించారు. కేటీపీఎస్‌ ఆరోదశ సర్వీస్‌ భవనం వద్ద ఏర్పాటు చేసిన అమర విద్యుత ఉద్యోగుల చిత్రపటానికి కేటీపీఎస్‌ 5,6దశల చీఫ్‌ ఇంజనీర్‌ కమతం రవీందర్‌కుమార్‌ నివాళులు అర్పించారు. కేటీపీఎస్‌ ఏడోదశలో చీఫ్‌ ఇంజనీర్‌ పలుకుర్తి వెంకటేశ్వరావు కూడా అమరులకు పూలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈకార్యక్రమాల్లో ఎస్‌ఈలు కృష్ణ, సంజీవయ్య, ఆరుద్ర, వరప్రసాద్‌, అనిల్‌కుమార్‌, టీఈఈఏ నాయకులు పీవీ రావు, ఉమామహేశ్వరావు, బ్రహ్మాజీ, జయభాస్కర్‌. అఖిలేష్‌, శ్రీపాల్‌, కీర్తి, ప్రకాష్‌, యాదగిరి, ఇస్మాయిల్‌, రజిత, మంగీలాల్‌, మధుబాబు, వై వెంకటేశ్వర్లు, చిల్లంచర్ల గిరిధర్‌, పలు యూనియన్‌ల నాయకులు దేవీ రాధాకృష్ణ, కంటె రాజేందర్‌, కేశబోయిన కోటేశ్వరావు, లక్ష్మణ్‌, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-08-22T05:05:16+05:30 IST