సన్నబియ్యం.. పురుగులమయం

ABN , First Publish Date - 2021-07-13T04:57:49+05:30 IST

భద్రాచలం ఐటీడీఏ గిరిజనసంక్షేమశాఖ ఆధ్వర్యంలో నిర్వహి స్తున్న విద్యార్థుల ఆశ్రమ పాఠశాలలు, వసతి గృహాల్లో సన్నబియ్యం నిల్వలు పురుగులు పడి వృథాగా మారాయి.

సన్నబియ్యం.. పురుగులమయం
ఆశ్రమ పాఠశాలల్లో ముక్కిపోతున్న సన్నబియ్యం

రెండేళ్లుగా గిరిజన వసతిగృహాల్లో వృథాగా నిల్వలు

ఉన్నతాధికారులు దృష్టి సారిస్తేనే ప్రయోజనం

దుమ్ముగూడెం జూలై 12: భద్రాచలం ఐటీడీఏ గిరిజనసంక్షేమశాఖ ఆధ్వర్యంలో నిర్వహి స్తున్న విద్యార్థుల ఆశ్రమ పాఠశాలలు, వసతి గృహాల్లో సన్నబియ్యం నిల్వలు పురుగులు పడి  వృథాగా మారాయి. రెండేళ్లుగా సన్నబియ్యంతో పాటు, నిత్యావసరాలు స్టోర్‌రూం లలో వృఽథాగా మారాయి. భద్రాచలం ఐటీడీఏ పరిదిలో మొత్తం యాభై గిరిజన బాల, బాలికల ఆశ్రమపాఠశాలలతోపాటు, పదిహేను వసతి గృహాలున్నాయి. 2020 మార్చి నె ల నుంచి కరోనా కారణంగా పాఠశాలలు మూసివేయగా, వసతి గృహాలు సైతం మూ తపడి ఉన్నాయి. నాటి నుంచి నేటి వరకు రెండేళ్లపాటు వందల క్వింటాళ్ల సన్నబియ్యం, నిత్యావసరాలు ఆశ్రమపాఠశాలలు, వసతిగృహాల స్టోర్‌ రూంలలో పురుగులు పట్టి పనికి రాకుండా పోతున్నాయి. మండలంలోని ఓ గిరిజన బాలుర ఆశ్రమపాఠశాలలోనే 2019- 20కు సంబంధించిన 30 క్వింటాళ్లు, 2020-21కు సంబంధించిన 36 క్వింటాళ్ల సన్న బి య్యం నిల్వలు కలిపి మొత్తం 66 క్వింటాళ్ల బియ్యం ఉన్నాయి. 2020-21కు సం బం ధించిన కందిపప్పు, వంటనూనె, చింతపండు, గోధుమరవ్వ, మినపప్పు తదితర ని త్యావసరాల నిల్వలున్నాయి. ఆశ్రమపాఠశాలు, వసతిగృహాలకు 2019-20 ఏడాది ఏప్రిల్‌ నెలలో కేటాయించిన సన్నబియ్యం మొత్తం పురుగులు పట్టి వృఽథాగా మారాయని తెలు స్తోండగా, మరలా 2021 మార్చి నెలలో వచ్చిన బియ్యం సైతం పాడైపోయే పరిస్థితి నెలకొంది. మండలంలోని ఒక్క గిరిజన బాలుర ఆశ్రమపాఠశాలలోనే 66 క్వింటాళ్ల బి య్యం స్టాకు ఉన్నట్లు తెలుస్తోండగా, భద్రాచలం ఐటీడీఏ పరిదిలో వందల క్వింటాళ్ల బి య్యం నిల్వలుండొచ్చని సమాచారం. 2019-20కు సంబంధించిన నిత్యావసరాలను కరో నా బాధితులకు పంపిణీ చేసినట్లు తెలుస్తోండగా, అవి కూడా పూర్తిగా సద్విని యోగం అవలేదని తెలుస్తోంది. సమీప కాలంలో వసతిగృహాలు, ఆశ్రమపాఠశాలలు తె రిచే అవ కాశం కన్పించకపోగా, బియ్యం నిల్వలను సద్వినియోగం చేయాల్సిన అవసరం ఉన్నతాఽ దికారులపై ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలల్లో సన్న బియ్యం నిల్వలను సంబంధిత ఎంఈవో కార్యాలయాలకు రప్పిస్తుం డగా, గిరిజన సంక్షేమశాఖ వసతిగృహాల్లో ఉన్న నిల్వలపై సైతం ఆ శాఖ అధికారులు దృష్టి సారించా ల్సి ఉంది. 

Updated Date - 2021-07-13T04:57:49+05:30 IST