క్రీడాకారుడికి రూ.పదివేల ఆర్థికసాయం

ABN , First Publish Date - 2021-12-31T05:15:20+05:30 IST

వైరా లయన్స్‌క్లబ్‌ ఆధ్వర్యంలో స్విమ్మర్స్‌ అసోసియేషన్‌ సహకారంతో కొణిజర్ల మండలంలోని తీగెలబంజర్‌కు చెందిన జాతీయ కబడ్డీ క్రీడాకారుడు నున్నావత్‌ రాజేష్‌కు రూ.10వేలు ఆర్థికసహాయాన్ని గురువారం అందించారు.

క్రీడాకారుడికి రూ.పదివేల ఆర్థికసాయం

వైరా, డిసెంబరు30: వైరా లయన్స్‌క్లబ్‌ ఆధ్వర్యంలో స్విమ్మర్స్‌ అసోసియేషన్‌ సహకారంతో కొణిజర్ల మండలంలోని తీగెలబంజర్‌కు చెందిన జాతీయ కబడ్డీ క్రీడాకారుడు నున్నావత్‌ రాజేష్‌కు రూ.10వేలు ఆర్థికసహాయాన్ని గురువారం అందించారు. జాతీయ కబడ్డీ పోటీలకు వెళ్లేందుకు ఆర్థిక ఇబ్బందులు ఉండటంతో ఈ సాయం అందించారు. లయన్స్‌క్లబ్‌ నిర్వాహాకులు డాక్టర్‌ కాపా మురళీకృష్ణ, లగడపాటి ప్రభాకర్‌, చింతనిప్పు వెంకటయ్య, ఉండ్రు శ్యాంబాబు, మాదినేని సునీత, తోటకూర శ్రీకాంత్‌, చింతోజు నాగేశ్వరరావు, చింతలపూడి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.

Updated Date - 2021-12-31T05:15:20+05:30 IST